ఏపీ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్‌ చూసేయండి

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం సాధించింది. 81 శాతంతో గుంటూరు రెండో స్థానం, 79 శాతంతో ఎన్టీఆర్‌ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి.

Advertisement
Update:2024-04-12 15:02 IST

ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫస్ట్‌ ఇయర్‌లో 67 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 78 శాతం మంది పాసయ్యారు. ఫలితాల్లో అమ్మాయిలు పైచేయి సాధించారు. ఫస్ట్‌ ఇయర్‌లో అమ్మాయిలు 71 శాతం, అబ్బాయిలు 64 శాతం మంది పాసయ్యారు. సెకండ్‌ ఇయర్‌లో అమ్మాయిలు 81 శాతం, అబ్బాయిలు 75 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకే సమయంలో రిలీజ్ చేశారు. ఈ లింక్‌ క్లిక్‌ చేసి http://resultsbie.ap.gov.in/ విద్యార్థులు ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం సాధించింది. 81 శాతంతో గుంటూరు రెండో స్థానం, 79 శాతంతో ఎన్టీఆర్‌ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. 48 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది.

సెకండ్ ఇయర్‌ ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించగా.. 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి. 84 శాతంతో విశాఖ జిల్లా మూడో స్థానం దక్కించుకుంది. 63 శాతంతో చిత్తూరు జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌ ఫీజు చెల్లింపునకు ఈనెల 18 నుంచి 24 వరకు అవకాశం కల్పించారు. మే 24 నుంచి జూన్‌ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Tags:    
Advertisement

Similar News