నారాయణకి ముందస్తు బెయిల్
మాజీ మంత్రి పొంగూరు నారాయణకి ముందస్తు బెయిల్ ని హైకోర్టు మంజూరు చేసింది.
మాజీ మంత్రి పొంగూరు నారాయణకి ముందస్తు బెయిల్ ని హైకోర్టు మంజూరు చేసింది. టిడిపి ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖా మంత్రిగా నారాయణ పనిచేశారు. ఈ కాలంలో అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‍మెంట్‍లో అక్రమాలు జరిగాయని, భూములు అమ్మి వందలకోట్లు సంపాదించారని వైసీపీ ఆరోపణలు చేసింది.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించింది. సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితులుగా మాజీ మంత్రి నారాయణ, రామకృష్ణ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ అంజనీకుమార్, లింగమనేని రమేశ్, రాజశేఖర్‍లతోపాటు మరికొంతమందిని పేర్కొంది.
ఈ కేసుని క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోరాదని ఇదివరకే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.