జగన్‌ వెంటే ఉంటా.. ట్రోల్స్‌ను పట్టించుకోను

ఎవరినీ వ్యక్తిగతంగా, ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదన్నారు. ప్రచారంలో ఏపీలో జరిగిన అభివృద్ధిపైనే మాట్లాడాననన్నారు. పార్టీ అప్పగించిన పనినే తాను నిర్వర్తించానని భవిష్యత్తులోనూ పార్టీ కోసం కష్టపడతానని చెప్పారు.

Advertisement
Update:2024-06-07 16:20 IST

తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు టాలీవుడ్ యాంకర్ శ్యామల. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. సోషల్‌మీడియాలో తనను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని ఇబ్బందులకు గురి చేసినా జగన్‌ వెంటే నడుస్తానన్న శ్యామల.. ట్రోల్స్‌ను పట్టించుకోనన్నారు. ఎవరి ఇష్టాయిష్టాలు వారికి ఉంటాయన్నారు. కేవలం తమకు నచ్చిన పనే ఇతరులు చేయాలని కోరుకోవడం తప్పన్నారు.

తాను ఎవరినీ వ్యక్తిగతంగా, ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదన్నారు. ప్రచారంలో ఏపీలో జరిగిన అభివృద్ధిపైనే మాట్లాడాననన్నారు. పార్టీ అప్పగించిన పనినే తాను నిర్వర్తించానని భవిష్యత్తులోనూ పార్టీ కోసం కష్టపడతానని చెప్పారు.

ఇక ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు శ్యామల. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో ఏపీకి మరింత మంచి జరగాలని ఆకాంక్షించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నానన్నారు. మళ్లీ జగన్‌తో కలిసి పోరాడి భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News