డిపాజిట‌ర్ల యాక్ట్ కేసులో 21 మందికి ప‌దేళ్ల జైలు - రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి

శిక్ష‌ప‌డిన వారిలో బ్యాంకు చైర్మ‌న్ రావూరి స‌త్య సాగ‌ర్ కూడా ఉన్నాడు. ప‌రారైన నిందితుడు గుండాల గోపి అని పీపీ ప్రేమ్‌కుమార్ వెల్ల‌డించారు.

Advertisement
Update:2022-11-22 11:58 IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర చ‌రిత్ర‌లో తొలిసారిగా డిపాజిట‌ర్ల యాక్ట్ కేసులో ముద్దాయిల‌కు శిక్ష విధిస్తూ న్యాయ‌స్థానం తీర్పు చెప్పింది. 20 ఏళ్ల‌పాటు కొన‌సాగిన న్యాయ పోరాటం ఈ తీర్పుతో ఫ‌లించింది. ఏలూరు ధ‌న బ్యాంకులో డిపాజిట‌ర్ల‌కు రూ.3 కోట్లు ఎగ‌వేసిన వ్య‌వ‌హారంలో 2002లో కేసు న‌మోదైంది.

ఈ వ్య‌వ‌హారంపై అప్ప‌టి నుంచి కొన‌సాగిన కేసు విచార‌ణలో సోమవారం సాయంత్రం న్యాయ‌మూర్తి తీర్పు వెలువ‌రించారు. మొత్తం 21 మంది నిందితుల‌కు ప‌ది సంవ‌త్స‌రాల శిక్ష విధిస్తూ ఏలూరు ప్రిన్సిప‌ల్ డిస్ట్రిక్ట్ సెష‌న్స్ జ‌డ్జి పురుషోత్తం కుమార్ ఈ తీర్పు చెప్పారు. దీంతో పాటు ఒక్కొక్క‌రికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వ‌ర‌కు జ‌రిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

జాయింట్ డైరెక్ట‌ర్ ఆఫ్ ప్రాసిక్యూష‌న్, ప్ర‌త్యేక పీపీ లామ్ అజ‌య్ ప్రేమ్ కుమార్ ఈ కేసు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఏలూరు టూటౌన్ ప‌రిధిలోని ధ‌న బ్యాంకు ప‌లువురు డిపాజిట‌ర్ల‌కు రూ.3 కోట్ల సొమ్ము చెల్లించ‌కుండా మోసం చేసింది. దీనిపై అప్ప‌ట్లోeluru-dhana-bank-chairman-sentenced-to-10-year-jailకు చెందిన 27 మందిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. వారిలో ఐదుగురు విచార‌ణ స‌మ‌యంలోనే మృతిచెంద‌గా, మ‌రొక‌రు ప‌రారీలో ఉన్నాడు. దీంతో మిగిలిన 21 మందికి శిక్ష ఖ‌రారు చేస్తూ న్యాయ‌మూర్తి తీర్పు చెప్పారు.

శిక్ష‌ప‌డిన వారిలో బ్యాంకు చైర్మ‌న్ రావూరి స‌త్య సాగ‌ర్ కూడా ఉన్నాడు. ప‌రారైన నిందితుడు గుండాల గోపి అని పీపీ ప్రేమ్‌కుమార్ వెల్ల‌డించారు.

Tags:    
Advertisement

Similar News