ఇవి పలు దేశాల సరిహద్దులే.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

దేశ సరిహద్దు అనగానే ముళ్ల కంచెలు, భారీగా పహారా కాసే సైన్యం, ఇటు మనిషి అటు పోకుండా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇండియాకు ఆనుకొని ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వద్ద ఇలాంటి సరిహద్దు దృశ్యాలే ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు చూడబోయే సరిహద్దులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇవి పలు దేశాల మధ్య సరిహద్దులు అంటే మీరు నమ్మడం కూడా కష్టమే. అలాంటివి కొన్ని చూసేయండి. 1. పోలాండ్-ఉక్రెయిన్ సరిహద్దు యూరోప్ దేశాలైన పోలాండ్-ఉక్రెయిన్‌ల మధ్య 535 […]

Advertisement
Update:2022-07-03 07:01 IST

దేశ సరిహద్దు అనగానే ముళ్ల కంచెలు, భారీగా పహారా కాసే సైన్యం, ఇటు మనిషి అటు పోకుండా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇండియాకు ఆనుకొని ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వద్ద ఇలాంటి సరిహద్దు దృశ్యాలే ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు చూడబోయే సరిహద్దులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇవి పలు దేశాల మధ్య సరిహద్దులు అంటే మీరు నమ్మడం కూడా కష్టమే. అలాంటివి కొన్ని చూసేయండి.

1. పోలాండ్-ఉక్రెయిన్ సరిహద్దు

యూరోప్ దేశాలైన పోలాండ్-ఉక్రెయిన్‌ల మధ్య 535 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది. ఇరు దేశాల మధ్య ఎలాంటి గోడలు, కంచెలు ఉండవు. దీంతో ఏ భూభాగం ఎవరిదనే విషయం స్థానికులు గుర్తించడం కష్టంగా మారింది. అయితే పోలాండ్‌కు చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ చాలా చోట్లు పెద్ద చేపల ఆకారంలో నేలపై బొమ్మలు గీశాడు. వాటిని అలాగే మెయింటైన్ చేస్తున్నారు. పై నుంచి చూస్తే చాలా ఆకర్షనీయంగా ఉంటుంది.

2. అర్జెంటీనా-బ్రెజిల్-పరాగ్వే సరిహద్దు

దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వేలు ఒక చోట కలుస్తాయి. దీన్ని ట్రై బార్డర్ అని పిలుస్తారు. అయితే ఈ సరిహద్దు సహజసిద్దంగా ఏర్పడిందే. ఇగ్వాజూ, పరానా నదులు కలిసే దగ్గరే మూడు దేశాల సరిహద్దుగా గుర్తించారు. దీంతో ఏ భూమి ఏ దేశానిది అనే గందరగోళం లేకుండా పోయింది.

3. హంగేరి-స్లోవేకియా సరిహద్దు

హంగేరీ, స్లోవేకియా దేశాలను దనుబే అనే నది విడదీస్తుంది. ఈ రెండు దేశాలను కలుపుతూ ఒక బ్రిడ్జ్ ఉన్నది. హంగేరీలోని స్తురోవో, స్లోవేకియాలోని ఆస్టార్‌గమ్ అనే నగరాలను ఈ బ్రిడ్జ్ కలుపుతుంది. ఈ బ్రిడ్జిని ఆర్చ్ డచెస్ మారీ వలేరీ అని పిలుస్తారు. ఆస్ట్రియా-హంగేరియన్ చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్ కూతురి పేరునే ఆ బ్రిడ్జికి పెట్టారు. ఇది 500 మీటర్లు పొడవు ఉంటుంది.

4. ఫ్రాన్స్-జర్మనీ-స్విట్జర్లాండ్ సరిహద్దు

స్విట్జర్లాండ్‌లోని మూడో అతిపెద్ద నగరమైన బాసిల్‌లో ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ సరిహద్దులు కలుస్తాయి. ఆ ట్రై జంక్షన్ వద్ద ఒక చిహ్నాన్ని నిర్మించారు. అంతే కాకుండా పక్కన ఉన్న భవనంపై ఏ వైపు ఏ దేశం ఉందనే వివరాలు కూడా ఉంటాయి. బాసిల్ నగరానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అనేక రకాలైన మ్యూజియమ్స్ ఉన్నాయి.

5. పోర్చుగల్ – స్పెయిన్ సరిహద్దు

పోర్చుగల్ స్పెయిన్ మధ్య దాదాపు వెయ్యేళ్ల క్రితం సరిహద్దును ఏర్పాటు చేశారు. 1200 కిలోమీటర్ల పొడవైన రోడ్డు ఈ దేశాల మధ్య సరిహద్దుగా ఉన్నది. 1143లో మొదటి సారి ఈ బార్డర్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1297లో స్థిరీకరించారు. అప్పటి నుంచి బార్డర్‌లో ఎలాంటి మార్పు జరగలేదు.

Advertisement

Similar News