ఢిల్లీలో పదేళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు.. హడలిపోతున్న ప్రజలు..
ఢిల్లీలో వానొచ్చినా, మంచు పడినా, ఎండలు మండినా తట్టుకోలేం. అక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు అలా ఉంటాయి. వర్షాకాలంలో ఢిల్లీ రోడ్లు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ఇక చలికాలంలో దట్టమైన పొగమంచుతో ఢిల్లీ రోడ్లపైకి రావాలంటేనే జనం హడలిపోతారు. చలికాలంలో విమాన సర్వీసులు కూడా రద్దవుతుంటాయి. తాజాగా ఢిల్లీలో వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలం చివరికి వచ్చినా ఇంకా చాలా ప్రాంతాల్లో అత్యథిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీ కూడా ఇందులో ఒకటి. ఢిల్లీలో గత […]
ఢిల్లీలో వానొచ్చినా, మంచు పడినా, ఎండలు మండినా తట్టుకోలేం. అక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు అలా ఉంటాయి. వర్షాకాలంలో ఢిల్లీ రోడ్లు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ఇక చలికాలంలో దట్టమైన పొగమంచుతో ఢిల్లీ రోడ్లపైకి రావాలంటేనే జనం హడలిపోతారు. చలికాలంలో విమాన సర్వీసులు కూడా రద్దవుతుంటాయి. తాజాగా ఢిల్లీలో వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలం చివరికి వచ్చినా ఇంకా చాలా ప్రాంతాల్లో అత్యథిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీ కూడా ఇందులో ఒకటి. ఢిల్లీలో గత పదేళ్లలో ఎప్పుడూ లేనట్టుగా అత్యథిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం.
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. వరుసగా 25 రోజుల నుంచి దేశ రాజధానిలో సగటున 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2012 తర్వాత ఈ స్థాయిలో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పెరగడం ఇదే తొలిసారి. 2012లో కూడా ఢిల్లీలో వరుసగా 30 రోజుల పాటు 42 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 2010లో అయితే ఏకబిగిన 35 రోజుల పాట ఎండలు దంచికొట్టాయి. ఐఎండీ గణాంకాల ప్రకారం 2012 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఎక్కువరోజులపాటు 42 డిగ్రీల ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ నమోదు కావడం ఇదే తొలిసారి. గడచిన రెండేళ్లలో ఢిల్లీ వాసులకు వేసవిలో ఎండ బాధ అంతగా లేదు. 2021లో కేవలం ఆరు రోజుల మాత్రమే ఎండలు దంచి కొట్టాయి. 2020లో కేవలం మూడు రోజులు మాత్రమే 40 డిగ్రీలకంటే ఎక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు ఢిల్లీలో నమోదయ్యాయి.
ఈ ఏడాది అన్నిచోట్లా అంతే..
ఢిల్లీ సంగతి పక్కనపెడితే, ఈ ఏడాది దేశవ్యాప్తంగా అత్యథిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1951 తర్వాత ఏప్రిల్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాది 2022 కావడం విశేషం. ఇక ఢిల్లీలో ఈ ఏడాది ఆరుసార్లు హీట్ వేవ్ వచ్చినట్లు ఐఎండీ తెలిపింది. మే నెల 15న అత్యధికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత ఢిల్లీలో నమోదైంది. పశ్చిమ వేడి గాలుల వల్ల ఇంకా ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణం వేడిగా ఉంటోంది.