ఒల్డ్ ఈజ్ గోల్డ్ ఆనంద్ టాప్ -10లో హారిక, ఆనంద్

భారత చెస్ దిగ్గజ ఆటగాడు, ఆల్ టైమ్ గ్రేట్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 52 సంవత్సరాల వయసులో తిరిగి ప్రపంచ చెస్ మొదటి 10 మంది అత్యుత్తమ ఆటగాళ్ల వరుసలో నిలిచాడు. నాలుగుదశాబ్దాల తన చదరంగ జీవితంలో ఐదుసార్లు ప్రపంచ విజేతగా చరిత్ర సృష్టించిన ఆనంద్..వయసు మీరడం, యువఆటగాళ్ల దూకుడు కారణంగా గత మూడేళ్లుగా వెనుకబడిపోయాడు. టైటిల్స్ నెగ్గడం సంగతి అంటుంచి టాప్-10 ర్యాంకింగ్స్ లో సైతం నిలువలేకపోయాడు. అయితే ..గత కొద్దివారాలుగా జరుగుతున్న పలు […]

Advertisement
Update:2022-06-03 08:04 IST

భారత చెస్ దిగ్గజ ఆటగాడు, ఆల్ టైమ్ గ్రేట్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 52 సంవత్సరాల వయసులో తిరిగి ప్రపంచ చెస్ మొదటి 10 మంది అత్యుత్తమ ఆటగాళ్ల వరుసలో నిలిచాడు.

నాలుగుదశాబ్దాల తన చదరంగ జీవితంలో ఐదుసార్లు ప్రపంచ విజేతగా చరిత్ర సృష్టించిన ఆనంద్..వయసు మీరడం, యువఆటగాళ్ల దూకుడు కారణంగా గత మూడేళ్లుగా వెనుకబడిపోయాడు. టైటిల్స్ నెగ్గడం సంగతి అంటుంచి టాప్-10 ర్యాంకింగ్స్ లో సైతం నిలువలేకపోయాడు.

అయితే ..గత కొద్దివారాలుగా జరుగుతున్న పలు అంతర్జాతీయ టోర్నీలలో కీలకవిజయాలు సాధించడం ద్వారా తన వ్యక్తిగత ర్యాంకింగ్ ను మెరుగుపరచుకోగలిగాడు.

నార్వే వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ చెస్ క్లాసికల్ విభాగం తొలిరౌండ్లో మాగ్నుస్ కార్ల్ సన్ ను, రెండో రౌండ్లో బల్గేరియా ఆటగాడు వాసెలిన్ తొపలోవ్, మూడోరౌండ్లో ఫాంగ్ హావో లను ఓిడించడం ద్వారా 6 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.

ఆనంద్ స్టాండర్డ్ విభాగంలో 2751 రేటింగ్, ర్యాపిడ్ విభాగంలో 2731, బ్లిడ్జ్ విభాగంలో 2728 పాయింట్లతో ఆనంద్ నిలిచాడు.

టాప్ ర్యాంక్ లో మాగ్నుస్ కార్స్ సన్…

అంతర్జాతీయ చెస్ సమాఖ్య విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం..నార్వే సూపర్ గ్రాండ్ మాస్టర్ మాగ్నుస్ కార్ల్ సన్ 2864 రేటింగ్ తో టాప్ ర్యాంకర్ గా నిలిచాడు.

చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ రెండు , ఫ్రెంచ్ గ్రాండ్ మాస్టర్ అలీరెజా మూడు, అమెరికన్ గ్రాండ్ మాస్టర్లు ఫాబియానో, ఆరోనియన్ నాలుగు, ఐదు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

రష్యన్ గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నెపోమెన్చి ఆరవ ర్యాంక్ లో నిలిచాడు. గత నెల వరకూ 15వ ర్యాంక్ లో కొట్టిమిట్టాడిన విశ్వనాథన్ ఆనంద్..ఐదుస్థానాల మేర తన ర్యాంక్ ను మెరుగు పరచుకొని మొదటి 10 ర్యాంకుల్లో నిలువగలిగాడు.

10వ ర్యాంకులో ద్రోణవల్లి హారిక..

 

మహిళల విభాగంలో తెలుగుతేజం, భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక మాత్రమే 10వ ర్యాంకులో నిలిచింది. హారిక 2517 పాయింట్లతో ప్రపంచ మొదటి 10 మంది అత్యుత్తమ మహిళా గ్రాండ్ మాస్టర్లలో చోటు సంపాదించింది.

Tags:    
Advertisement

Similar News