ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారన్న భయంతో.. వాళ్లను వేరే రాష్ట్రానికి తరలిస్తున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ మరోసారి రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. హర్యానా రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ రాజ్యసభ అభ్యర్థికి ఓటేయకుండా, ఎక్కడ అమ్ముడు పోతారో అనే భయంతో వాళ్లను వేరే రాష్ట్రానికి తరలించడానికి ఏర్పాట్లు చేసింది. ఈ నెల 10న పలు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్ల కోసం పోలింగ్ జరుగనున్నది. హర్యానా నుంచి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా అజయ్ మాకెన్‌ను నిలిపింది. కాగా, బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలో తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడు […]

Advertisement
Update:2022-06-01 10:14 IST

కాంగ్రెస్ పార్టీ మరోసారి రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. హర్యానా రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ రాజ్యసభ అభ్యర్థికి ఓటేయకుండా, ఎక్కడ అమ్ముడు పోతారో అనే భయంతో వాళ్లను వేరే రాష్ట్రానికి తరలించడానికి ఏర్పాట్లు చేసింది. ఈ నెల 10న పలు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్ల కోసం పోలింగ్ జరుగనున్నది. హర్యానా నుంచి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా అజయ్ మాకెన్‌ను నిలిపింది.

కాగా, బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలో తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారనే భయంతో కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్‌గడ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇవ్వాలో రేపో వారిని రాయ్‌పూర్ సమీపంలోని ఒక రిసార్టుకు పంపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యేల కోసం రూమ్స్ కూడా బుక్ చేసినట్లు తెలుస్తున్నది.

కాగా, హర్యానాలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ కుల్దీప్ బిష్ణోయ్ పార్టీ నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నారు. అలాగే కార్తీకే శర్మ కూడా ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉన్నట్లు పార్టీ భావిస్తున్నది. అందుకే వేరే పార్టీతో పాటు సొంత పార్టీ నుంచి కూడా వచ్చే ప్రలోభాలకు లోను కాకుండా ఉండేందుకే ఎమ్మెల్యేలను వేరే రాష్ట్రానికి తరలిస్తున్నట్లు తెలుస్తున్నది. గతంలో గోవా, మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ రిసార్ట్ పాలిటిక్స్ చేసింది.

Tags:    
Advertisement

Similar News