పెళ్ళిపేరుతో 300 మంది యువతుల దగ్గర కోట్ల రూపాయలు దోచుకున్న కేటుగాడు
అతనో అంతర్జాతీయ సైబర్ మోసగాడు. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో తన బయోడేటా పోస్ట్ చేస్తాడు. తాను కెనడాలో సెటిల్ అయిన ఇండియన్ ను అని, అక్కడ బిజినెస్ చేస్తున్నాని, లేదా పెద్ద ఉద్యోగం చేస్తున్నానని తన వివరాలు ఇస్తాడు. అందమైన పురుషుల ఫోటోలు అప్ లోడ్ చేస్తాడు. ఆ ఫోటోలు తనవే అని నమ్మిస్తాడు.ఆ వెబ్ సైట్ లో పరిచయమైన యువతులతో స్నేహం చేస్తాడు. వాళ్ళతో రోజూ ఫోన్లో మాటలు, చాటింగులు చేస్తూ వాళ్ళను పెళ్ళి చేసుకుంటానని […]
అతనో అంతర్జాతీయ సైబర్ మోసగాడు. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో తన బయోడేటా పోస్ట్ చేస్తాడు. తాను కెనడాలో సెటిల్ అయిన ఇండియన్ ను అని, అక్కడ బిజినెస్ చేస్తున్నాని, లేదా పెద్ద ఉద్యోగం చేస్తున్నానని తన వివరాలు ఇస్తాడు. అందమైన పురుషుల ఫోటోలు అప్ లోడ్ చేస్తాడు. ఆ ఫోటోలు తనవే అని నమ్మిస్తాడు.ఆ వెబ్ సైట్ లో పరిచయమైన యువతులతో స్నేహం చేస్తాడు. వాళ్ళతో రోజూ ఫోన్లో మాటలు, చాటింగులు చేస్తూ వాళ్ళను పెళ్ళి చేసుకుంటానని నమ్మిస్తాడు. ఆ యువతులు పూర్తిగా నమ్మారని అనుకున్న తర్వాత ఏవేవో అర్జెంట్ అవసరాలని చెప్పి వాళ్ళ నుండి కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఇలా 300 మంది యువతుల ను మోసం చేశాడా కేటుగాడు.
ఇంత దర్జాగా యువతులను కొల్లగొడుతున్న ఆ కేటు గాడు అసలు భారతీయుడే కాదు. అతనో నైజీరియన్.ఇదే పని కోసం ఢిల్లీలో ఉంటున్నాడు. నైజీరియాలోని లాగోస్‌కు చెందిన అతని పేరు గరుబా గలుమ్జే. 38 ఏళ్ళ ఇతగాడు దక్షిణ ఢిల్లీలోని కిషన్ ఘర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు.
ఈ మధ్య యుపిలోని మీరట్ జిల్లాలో నివసిస్తున్న ఒక మహిళను జీవన్‌సతి వెబ్‌సైట్లో పరిచయం చేసుకున్నాడు. తన పేరు సంజయ్ సింగ్ అని తాను కెనడాలో ఉంటానని ఆమెను నమ్మించాడు. ఆమె పూర్తిగా నమ్మిన తర్వాత తనకు అర్జెంట్ డబ్బులు అవసరమని చెప్పి భావోద్వేగపూరితంగా మాట్లాడి ఆమెను నమ్మించాడు. ఆ యువతి అతని మైకం నుండి బైటపడకముందే తన వివిధ బ్యాంకు ఖాతాల్లోకి అనేక వాయిదాలలో 60 లక్షల రూపాయలను ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. ఆలస్యంగా ప్రేమ మైకం దిగిపోయిన ఆ యువతి పోలీసులకు పిర్యాదు చేసింది.
రంగంలోకి దిగిన పోలీసులు ఆ కేటుగాడు ఢిల్లీలోనే ఉన్నట్టు గుర్తించారు. వలపన్నిసంజయ్ సింగ్ ఉరఫ్ గరుబా గలుమ్జేను అరెస్టు చేశారు. అతన్ని విచారణ జరుపుతున్న పోలీసులకు నిర్ఘాంతపోయే విషయాలు తెలిశాయి. ఈ ఒక్క యువతే మోసపోయిందని అనుకున్న పోలీసులకు 300 మంది యువతులను తాను మోసం చేసి డబ్బులు గుంజినట్టు చెప్పి ధిగ్బ్రాంతికి గురి చేశాడా సైబర్ మోసగాడు.
“అతన్ని ప్రశ్నిస్తున్నప్పుడు, గరుబాకు సంబంధించిన అనేక కేసులు బైటపడ్డాయి. అతను వివిధ ప్రముఖ వెబ్‌సైట్‌ల ద్వారా యువతులనే లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. సోషల్ మీడియా, మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లలో, అతను స్మార్ట్‌గా కనిపించే పురుషుల ప్రొఫైల్ చిత్రాలను ఉపయోగించాడు.” అని నోయిడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ రీటా యాదవ్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గరుబా మొదటిసారి ఫిబ్రవరి 2019లో ఆరు నెలల వీసాపై మనుషుల వెంట్రుకలు, రెడీమేడ్ దుస్తుల వ్యాపారానికి సంబంధించి భారతదేశానికి వచ్చాడు.
మరోసారి మే 2022 వరకు మెడికల్ వీసాపై మార్చి 18 న భారతదేశానికి వచ్చాడు.
“గరుబా ఇక్కడ దోచుకున్న సొమ్మును అంతర్జాతీయ మనీ ఎక్స్ఛేంజ్ ల ద్వారా నైజీరియాలోని తన కుటుంబ సభ్యులకు బదిలీ చేస్తున్నాడు” అని పోలీసులు తెలిపారు.
అరెస్టు సమయంలో గరుబా దగ్గర బ్యాంక్ ఆఫ్ థాయ్‌లాండ్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్, ఇంటర్‌పోల్, యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, ఎఫ్‌బిఐ పేర్లతో నకిలీ లేఖలతో సహా పాస్‌పోర్ట్, ఏడు మొబైల్ ఫోన్లు, 15 పత్రాల ఫోటోకాపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.