హైదరాబాద్ లో నిలిచిపోయిన ఆటోలు, క్యాబ్ లు.. అర్థరాత్రి నుంచి ప్రయాణికుల ఇబ్బందులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మోటర్ వాహనాల చట్టం-2019ని నిరసిస్తూ.. ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ ఒకరోజు బంద్ చేపట్టింది. అర్థరాత్రినుంచి బంద్ మొదలు కాగా.. ఇప్పటికే ప్రయాణికులకు అవస్థలు మొదలయ్యాయి. ప్రైవేటు వాహనాలు లేక ప్రయాణికులు గమ్యస్థానాలు చేరేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నా.. రద్దీ పెరిగిపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. డ్రైవర్స్ జేఏసీ చేపట్టిన బంద్ అర్ధరాత్రి నుంచి మొదలైంది. ఆటోలు, క్యాబ్‌లు, లారీల సేవలు పూర్తిగా […]
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మోటర్ వాహనాల చట్టం-2019ని నిరసిస్తూ.. ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ ఒకరోజు బంద్ చేపట్టింది. అర్థరాత్రినుంచి బంద్ మొదలు కాగా.. ఇప్పటికే ప్రయాణికులకు అవస్థలు మొదలయ్యాయి. ప్రైవేటు వాహనాలు లేక ప్రయాణికులు గమ్యస్థానాలు చేరేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నా.. రద్దీ పెరిగిపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడంలేదు.
డ్రైవర్స్ జేఏసీ చేపట్టిన బంద్ అర్ధరాత్రి నుంచి మొదలైంది. ఆటోలు, క్యాబ్‌లు, లారీల సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. నూతన ఎంవీ చట్టం – 2019 అమలు వల్ల జరిమానాలు భారీగా పెరిగిపోయాయని, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డ్రైవర్స్ జేఏసీ చెబుతోంది. నూతన చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు పెరిగిన ఇంధన ధరలతో అష్టకష్టాలు పడుతున్నామని, జరిమానాల పేరుతో తమపై అదనపు భారం మోపడం సరికాదని అంటున్నారు. ఈరోజు ట్రాన్స్ పోర్ట్ భవన్ ని ముట్టడికి పిలుపునిచ్చారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్రాన్స్‌పోర్ట్ భవన్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి డ్రైవర్స్ జేఏసీ నిరసన తెలియజేయబోతోంది. ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్‌ఐఎఫ్, క్యాబ్, ఆటో, లారీ సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి.
ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..
ఆటోలు, క్యాబ్‌లు, లారీలు ఒకరోజు బంద్ పాటిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అర్ధరాత్రి నుంచే రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో బస్సుల సంఖ్యను పెంచింది. ప్రయాణికుల అవసరాల మేరకు అదనపు బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు అధికారులు. ఆయా రూట్లలో బస్సులు అవసరమైతే 9959226160, 9959226154 నంబర్లకు ఫోను చేయాలని సూచించారు.