ఆచార్య.. నాలుగో రోజు దారుణం

పెద్ద సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా 4-5 రోజుల పాటు వసూళ్లు తగ్గవు. అప్పటికే అడ్వాన్స్ గా టిక్కెట్లు బుక్ చేసిన వాళ్లుంటారు. అభిమానంతో చూసే వాళ్లుంటారు. ఫ్లాప్ అయినా పెద్ద సినిమా కాబట్టి చూద్దాం అనుకునే వాళ్లుంటారు. కానీ ఈ లాజిక్కులేవీ ఆచార్య ముందు పనిచేయలేదు. నాలుగో రోజైన సోమవారం ఈ సినిమా దారుణంగా పడిపోయింది. మొదటి 3 రోజులు వసూళ్లు పడినప్పటికీ, కోట్లలోనే షేర్ వచ్చింది. కానీ నాలుగో రోజు అమాంతం ఆచార్య వసూళ్లు […]

Advertisement
Update:2022-05-03 11:42 IST

పెద్ద సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా 4-5 రోజుల పాటు వసూళ్లు తగ్గవు. అప్పటికే అడ్వాన్స్ గా టిక్కెట్లు బుక్ చేసిన వాళ్లుంటారు. అభిమానంతో చూసే వాళ్లుంటారు. ఫ్లాప్ అయినా పెద్ద సినిమా కాబట్టి చూద్దాం అనుకునే వాళ్లుంటారు. కానీ ఈ లాజిక్కులేవీ ఆచార్య ముందు పనిచేయలేదు. నాలుగో రోజైన సోమవారం ఈ సినిమా దారుణంగా పడిపోయింది.

మొదటి 3 రోజులు వసూళ్లు పడినప్పటికీ, కోట్లలోనే షేర్ వచ్చింది. కానీ నాలుగో రోజు అమాంతం ఆచార్య వసూళ్లు లక్షల్లోకి పడిపోయాయి. ఇంకా చెప్పాలంటే, తెలుగు రాష్ట్రాల్లో పట్టుమని కోటి రూపాయల షేర్ కూడా రాలేదు. ఓ పెద్ద హీరో సినిమా 4వ రోజుకే ఈ రేంజ్ లో పడిపోవడం, ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి.

ఇక వసూళ్ల లెక్కలోకి వద్దాం. ఆచార్య సినిమాకు మొదటి రోజు 29 కోట్ల 50 లక్షల రూపాయలు (జీఎస్టీలు కాకుండా) షేర్ వచ్చింది. చరణ్-చిరు కలిసి నటించిన సినిమా కావడంతో హైప్ తో వసూళ్లు బాగా వచ్చాయి. కానీ మొదటి రోజుకే ఫ్లాప్ టాక్ రావడంతో, రెండో రోజుకు ఈ సినిమా వసూళ్లు అమాంతం పడిపోయాయి. ఏకంగా 5 కోట్ల 15 లక్షల రూపాయల షేర్ కు పడిపోయింది.

ఇక కీలకమైన మూడో రోజు, అంటే ఆదివారం నాడు ఆచార్య సినిమాకు కేవలం 4 కోట్ల 7 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. అయితే ఇవన్నీ ఒకెత్తయితే, నాలుగో రోజైన సోమవారం ఈ సినిమా రన్ మరో ఎత్తు. ఎవ్వరూ కలలో కూడా ఊహించని విధంగా ఆచార్య వసూళ్లు డ్రాప్ అయ్యాయి. కేవలం 53 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

నిజానికి నిన్న ఈ సినిమాకు కనీసం 2 కోట్ల రూపాయల షేర్ వస్తుందని ట్రేడ్ భావించింది. కానీ అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ అతి తక్కువ ఆక్యుపెన్సీ నమోదుచేసింది ఆచార్య. ఫలితంగా ఇంత తక్కువ షేర్ వచ్చింది. రంజాన్ హాలిడే ఈ సినిమాకు ఏమైనా కలిసొస్తుందేమో చూడాలి.

Tags:    
Advertisement

Similar News