సినిమాలే కాదు, పాటలూ పాన్ ఇండియా
సినిమాలే కాకుండా, పాటలకు కూడా పాన్ ఇండియా అప్పీల్ వచ్చిందని చెబుతున్నాడు సంగీత దర్శకుడు తమన్. సినిమాలతో సంబంధం లేకుండా కొన్ని పాటలు ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అవుతున్నాయంటే దానికి కారణం సంగీతం అంటున్నాడు. “లిరికల్ వీడియోకు కూడా భారీగా ఖర్చుపెట్టడం నాతోనే మొదలైంది. ఆడియో కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పాట బాలేకపోతే వారు పెట్టుబడి పెట్టరు. వాళ్లకి కూడా కొన్ని లెక్కలు, టీమ్ వుంటుంది. అందరూ అప్రూవ్ చేయనిదే అంతంత బడ్జెట్లు రావు. పెట్టుబడికి […]
సినిమాలే కాకుండా, పాటలకు కూడా పాన్ ఇండియా అప్పీల్ వచ్చిందని చెబుతున్నాడు సంగీత దర్శకుడు తమన్. సినిమాలతో సంబంధం లేకుండా కొన్ని పాటలు ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అవుతున్నాయంటే దానికి కారణం సంగీతం అంటున్నాడు.
“లిరికల్ వీడియోకు కూడా భారీగా ఖర్చుపెట్టడం నాతోనే మొదలైంది. ఆడియో కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పాట బాలేకపోతే వారు పెట్టుబడి పెట్టరు. వాళ్లకి కూడా కొన్ని లెక్కలు, టీమ్ వుంటుంది. అందరూ అప్రూవ్ చేయనిదే అంతంత బడ్జెట్లు రావు. పెట్టుబడికి తగిన రాబడి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. 150 మిలియన్ వ్యూస్ సాధించడం అంత తేలిక విషయం కాదు. సినిమాలే కాదు పాటలు కూడా పాన్ ఇండియా అయిపోయాయి. ఒక పాట రీచ్ అవాలంటే.. అది గ్లోబల్ గా ఉందా ? ఎవరు పాడుతున్నారు ? ఇలా చాలా అంశాలు వుంటాయి. ఈ భాద్యతలన్నీ తీసుకోవాల్సివస్తుంది.”
ఒకప్పుడు పాట కంపోజ్ చేయాలంటే హీరోను దృష్టిలో పెట్టుకుంటే సరిపోయేదని, కానీ ఇప్పుడు ఓ పాటను కంపోజ్ చేయాలంటే చాలా అంశాల్ని దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుందని అన్నారు. వీటి వల్ల మ్యూజిక్ డైరక్టర్ పై అదనపు ఒత్తిడి పెరుగుతోందన్నారు. అయితే తను అలాంటి ఒత్తిడిని ఇష్టపడతానని, అప్పుడే పాటలు మరింత క్వాలిటీతో వస్తాయని చెబుతున్నాడు తమన్.