ధనుష్ హాలీవుడ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..!
వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తమిళనాట తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో ధనుష్. భాషా భేదాలు లేకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించే ధనుష్ ప్రస్తుతం హాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘ది గ్రే మ్యాన్’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆంథోని రూసో, జోసెఫ్ రూసో దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. హాలీవుడ్ నటులు ర్యాన్ గ్లోసింగ్స్, క్రిస్ ఎవాన్స్, అనా […]
వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తమిళనాట తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో ధనుష్. భాషా భేదాలు లేకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించే ధనుష్ ప్రస్తుతం హాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘ది గ్రే మ్యాన్’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆంథోని రూసో, జోసెఫ్ రూసో దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. హాలీవుడ్ నటులు ర్యాన్ గ్లోసింగ్స్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ధనుష్ నటిస్తున్నట్లు సమాచారం. ధనుష్ హాలీవుడ్లో నటిస్తున్న రెండవ సినిమా ఇది. 2018లో ఆయన ‘ది ఎక్సట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్’ అనే హాలీవుడ్ సినిమాలో నటించాడు. అవెంజర్స్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించిన రూసో బ్రదర్స్ ది గ్రే మ్యాన్ కు దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
ది గ్రే మ్యాన్ లో తన లుక్ ను రివీల్ చేస్తూ హీరో ధనుష్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ ఫొటో కింద ది గ్రే మ్యాన్.. జులై 22వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతుందని వెల్లడించారు. కారు పై కప్పు పైన మోకాళ్లపై నిలబడి నుదుటన రక్తంతో సీరియస్ లుక్ లో ధనుష్ కనిపించాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ధనుష్ తెలుగులో ‘సార్’ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు.