వరుణ్ తేజ్ కొత్త సినిమా సంగతులు
వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ, యూత్ పల్స్ తెలుసుకుని ముందుకు సాగుతున్న ట్రెండీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్. ఆయన తాజాగా మరో సబ్జెక్ట్ ని ఓకే చేశారు. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న 12వ సినిమా ప్రారంభోత్సవం ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో ఆత్మీయుల సమక్షంలో జరిగింది. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నాగబాబు కొణిదెల సమర్పణలో బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా […]
వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ, యూత్ పల్స్ తెలుసుకుని ముందుకు సాగుతున్న ట్రెండీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్. ఆయన తాజాగా మరో సబ్జెక్ట్ ని ఓకే చేశారు. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న 12వ సినిమా ప్రారంభోత్సవం ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో ఆత్మీయుల సమక్షంలో జరిగింది.
యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నాగబాబు కొణిదెల సమర్పణలో బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. సినిమాటోగ్రఫీని ముఖేష్ హ్యాండిల్ చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి వరుణ్‌తేజ్ తల్లి పద్మజ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వరుణ్‌తేజ్ తండ్రి నాగబాబు క్లాప్‌కొట్టారు. వారిద్దరూ సంయుక్తంగా స్క్రిప్ట్ అందజేశారు. ఎస్వీసీసీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా ఇది. హీరోయిన్ ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తారు.
వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా రాబోతోంది ఈ సినిమా. ప్రస్తుతం ది ఘోస్ట్ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు వరుణ్ తేజ్. ఆ సినిమా పూర్తయిన వెంటనే వరుణ్ తేజ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు.