ఇటు లవ్ ట్రిప్.. అటు ఫారిన్ ట్రిప్
రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒకేసారి 2 ట్రిప్పులు నడుస్తున్నాయి. వీటిలో ఒకటి లవ్ ట్రిప్ కాగా.. రెండోది హాలిడే ట్రిప్. అవును.. సినిమాకు ప్రచారం కల్పించేందుకు దర్శకుడు రాధాకృష్ణ, లవ్ ట్రిప్ పేరిట ఆంధ్రాలో పర్యటిస్తున్నాడు. ఇటు ప్రభాస్ మాత్రం కాస్త విశ్రాంతి కోసం హాలిడే ట్రిప్ కు వెళ్లాడు. రాధేశ్యామ్ సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది. మొదటి 3 రోజులు వసూళ్లు బాగున్నప్పటికీ, గత సోమవారం నుంచి భారీగా ఆక్యుపెన్సీ పడిపోయింది. రోజురోజుకు కలెక్షన్లు […]
రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒకేసారి 2 ట్రిప్పులు నడుస్తున్నాయి. వీటిలో ఒకటి లవ్ ట్రిప్ కాగా.. రెండోది హాలిడే ట్రిప్. అవును.. సినిమాకు ప్రచారం కల్పించేందుకు దర్శకుడు రాధాకృష్ణ, లవ్ ట్రిప్ పేరిట ఆంధ్రాలో పర్యటిస్తున్నాడు. ఇటు ప్రభాస్ మాత్రం కాస్త విశ్రాంతి కోసం హాలిడే ట్రిప్ కు వెళ్లాడు.
రాధేశ్యామ్ సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది. మొదటి 3 రోజులు వసూళ్లు బాగున్నప్పటికీ, గత సోమవారం నుంచి భారీగా ఆక్యుపెన్సీ పడిపోయింది. రోజురోజుకు కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. ఇప్పటికే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం ఈ సినిమాను మరింత ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో, ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేందుకు దర్శకుడు రాధాకృష్ణ, మ్యూజిక్ డైరక్టర్ తమన్ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కాలేజీల్లో చక్కర్లు కొడుతున్నారు.
అటు ప్రభాస్ మాత్రం ఎట్టకేలకు ఓ చిన్న బ్రేక్ తీసుకున్నాడు. రాధేశ్యామ్ రిలీజైన వెంటనే విహారయాత్రకు వెళ్లాడు. ఎప్పట్లానే ప్రభాస్ ఏ దేశం వెళ్లాడనేది సస్పెన్స్ గా ఉంచారు. తిరిగొచ్చిన వెంటనే సలార్ కొత్త షెడ్యూల్ లో జాయిన్ అవుతాడు ప్రభాస్. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో కొత్త సినిమాను స్టార్ట్ చేస్తాడు.