రాధేశ్యామ్ మొదటి వారాంతం వసూళ్లు

ప్రభాస్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన రాధేశ్యామ్ సినిమా సక్సెస్ ఫుల్ గా మొదటి వారాంతం పూర్తిచేసుకుంది. విడుదలైన ఈ 3 రోజుల్లో సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 151 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. చూడ్డానికి ఇది పెద్ద మొత్తంలా అనిపించినప్పటికీ సినిమా బడ్జెట్, ప్రభాస్ స్టామినాతో పోల్చి చూస్తే తక్కువనే చెప్పాలి. ఇప్పుడు ప్రాంతాలవారీగా చూద్దాం ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఈ సినిమాకు ఏపీ,నైజాం నుంచి 48 కోట్ల రూపాయల […]

Advertisement
Update:2022-03-14 13:36 IST

ప్రభాస్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన రాధేశ్యామ్ సినిమా సక్సెస్ ఫుల్ గా మొదటి వారాంతం పూర్తిచేసుకుంది. విడుదలైన ఈ 3 రోజుల్లో సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 151 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. చూడ్డానికి ఇది పెద్ద మొత్తంలా అనిపించినప్పటికీ సినిమా బడ్జెట్, ప్రభాస్ స్టామినాతో పోల్చి చూస్తే తక్కువనే చెప్పాలి. ఇప్పుడు ప్రాంతాలవారీగా చూద్దాం

ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఈ సినిమాకు ఏపీ,నైజాం నుంచి 48 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. నిజానికి ఈ 3 రోజుల్లో 60 కోట్ల రూపాయల షేర్ వస్తుందని నిర్మాతలు అంచనా వేశారు. అటు మలయాళ, తమిళ భాషల్లో రాధేశ్యామ్ ఫ్లాప్ అవ్వగా.. హిందీలో సినిమాకు ఏకంగా డిజాస్టర్ టాక్ వచ్చేసింది. దీంతో వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఓవర్సీస్ లో మాత్రం ఉన్నంతలో ఈ సినిమా హిట్టయింది. అంతేకాదు, బ్రేక్ ఈవెన్ కూడా అయింది. ఏపీ,నైజాంలో మాత్రం ఈ సినిమా బ్రేక్ అవ్వడానికి ఇంకా 60 కోట్ల రూపాయల వసూళ్లు రావాల్సి ఉంది.

ఏపీ,నైజాం 3 రోజుల షేర్లు
నైజాం – 22.30 కోట్లు
సీడెడ్ – 6.65 కోట్లు
ఉత్తరాంధ్ర – 4.15 కోట్లు
ఈస్ట్ – 3.87 కోట్లు
వెస్ట్ – 2.98 కోట్లు
గుంటూరు – 4.06 కోట్లు
కృష్ణా – 2.34 కోట్లు
నెల్లూరు – 1.88 కోట్లు

Tags:    
Advertisement

Similar News