చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిశారు

ఇద్దరు పెద్ద స్టార్లు కలిశారు. కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఆ ముహూర్తం రానే వచ్చింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిశారు. గాడ్ ఫాదర్ సినిమా కోసం ఇద్దరూ కలిసి షూటింగ్ స్టార్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ కోసం స్వయంగా చిరంజీవి, హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లారు. ముంబయిలోని కజ్రత్ లో ఉన్న ఎన్డీ స్టుడియోస్ లో గాడ్ ఫాదర్ కోసం భారీ సెట్ వేశారు. ఈ సెట్ లోకి […]

Advertisement
Update:2022-03-14 13:41 IST

ఇద్దరు పెద్ద స్టార్లు కలిశారు. కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఆ ముహూర్తం రానే వచ్చింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిశారు. గాడ్ ఫాదర్ సినిమా కోసం ఇద్దరూ కలిసి షూటింగ్ స్టార్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ కోసం స్వయంగా చిరంజీవి, హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లారు.

ముంబయిలోని కజ్రత్ లో ఉన్న ఎన్డీ స్టుడియోస్ లో గాడ్ ఫాదర్ కోసం భారీ సెట్ వేశారు. ఈ సెట్ లోకి ఈరోజు సల్మాన్ ఖాన్ ఎంటరయ్యాడు. చిరంజీవి అప్పటికే చేరుకున్నారు. ఇద్దరూ కలిసి గాడ్ ఫాదర్ కోసం కొన్ని సన్నివేశాల్లో నటించారు. వీళ్లిద్దర్నీ ఒకే ఫ్రేమ్ లో పెట్టి డైరక్ట్ చేసిన ఘనత అందుకున్నాడు దర్శకుడు మోహన్ రాజా.

మలయాళం సూపర్ హిట్టయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది గాడ్ ఫాదర్. చిరంజీవి ఇమేజ్, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు భారీ మార్పుచేర్పులు చేశారు. ఇక ఎప్పుడైతే సల్మాన్ ఖాన్ ఎంటరయ్యాడో, అతడ్ని దృష్టిలో పెట్టుకొని కూడా భారీ మార్పులు చేశారు. మలయాళం వెర్షన్ లో పృధ్విరాజ్ పోషించిన పాత్రను గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ పోషిస్తున్నాడు.

ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నయనతార కనిపించనుంది. మరో కీలక పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఆచార్య తర్వాత రిలీజ్ అయ్యే మూవీ ఇదే.

Tags:    
Advertisement

Similar News