రాధేశ్యామ్ ప్రీ -రిలీజ్ బిజినెస్

దేశంలోనే అత్యథికంగా పారితోషికం తీసుకుంటున్న హీరో ప్రభాస్. ఈ విషయంలో సల్మాన్ ఖాన్ ను కూడా వెనక్కి నెట్టేశాడు ప్రభాస్. మరి ఇలాంటి హీరో నటించిన సినిమా థియేటర్లలోకి వస్తోందంటే బిజినెస్ చుక్కల్ని తాకాల్సిందే. రాధేశ్యామ్ విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ 200 కోట్ల రూపాయలకు పైగా సాగింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. టాలీవుడ్ తో పాటు దేశమంతా అతడికి ఫ్యాన్స్ ఉన్నారు, మార్కెట్ కూడా ఉంది. అందుకే రాధేశ్యామ్ […]

Advertisement
Update:2022-03-10 02:43 IST

దేశంలోనే అత్యథికంగా పారితోషికం తీసుకుంటున్న హీరో ప్రభాస్. ఈ విషయంలో సల్మాన్ ఖాన్ ను కూడా వెనక్కి నెట్టేశాడు ప్రభాస్. మరి ఇలాంటి హీరో నటించిన సినిమా థియేటర్లలోకి వస్తోందంటే బిజినెస్ చుక్కల్ని తాకాల్సిందే. రాధేశ్యామ్ విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ 200 కోట్ల రూపాయలకు పైగా సాగింది.

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. టాలీవుడ్ తో పాటు దేశమంతా అతడికి ఫ్యాన్స్ ఉన్నారు, మార్కెట్ కూడా ఉంది. అందుకే రాధేశ్యామ్ సినిమా ప్రతి ఏరియాలో ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయింది. చివరికి మధ్యప్రదేశ్, కోల్ కతా లాంటి ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగిందంటే, ప్రభాస్ మేనియాను అర్థం చేసుకోవచ్చు. నైజాం, ఆంధ్రా, సీడెడ్ తో కలిపి ఈ సినిమా 107 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

రాధేశ్యామ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి
నైజాం – రూ. 36.8 కోట్లు
సీడెడ్ – రూ. 18 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 13.20 కోట్లు
ఈస్ట్ – రూ. 8.8 కోట్లు
వెస్ట్ – రూ. 7.7 కోట్లు
గుంటూరు – రూ. 9.9 కోట్లు
నెల్లూరు – రూ. 4.4 కోట్లు
కృష్ణా – రూ. 8.2 కోట్లు

Tags:    
Advertisement

Similar News