నో చెబుదామనుకొని లవ్ లో పడిపోయాను

రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు ప్రభాస్. ఈ సినిమా కథ చెప్పినప్పుడు నో చెబుదాం అనుకున్నాడట ఈ హీరో. కానీ తనకు తెలియకుండానే అప్రయత్నంగా లవ్ లో పడిపోయాడట. అలా రాధేశ్యామ్ సినిమా వైపు విధి తనను నడిపించిందంటున్నాడు ఈ హీరో. “మామూలుగానే నాకు ఎవ్వరూ లవ్ స్టోరీలు చెప్పరు. రాధాకృష్ణ చెబుతానన్నాడు. ఓకే అన్న తర్వాత కథ చెప్పడానికొచ్చాడు. ఓపెన్ చేస్తే జాతకాలతో స్టార్ట్ చేశాడు. అదేంటి నేను నమ్మను కదా, […]

Advertisement
Update:2022-03-08 02:31 IST

రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు ప్రభాస్. ఈ సినిమా కథ చెప్పినప్పుడు నో చెబుదాం అనుకున్నాడట ఈ హీరో. కానీ తనకు తెలియకుండానే అప్రయత్నంగా లవ్ లో పడిపోయాడట. అలా రాధేశ్యామ్ సినిమా వైపు విధి తనను నడిపించిందంటున్నాడు ఈ హీరో.

“మామూలుగానే నాకు ఎవ్వరూ లవ్ స్టోరీలు చెప్పరు. రాధాకృష్ణ చెబుతానన్నాడు. ఓకే అన్న తర్వాత కథ చెప్పడానికొచ్చాడు. ఓపెన్ చేస్తే జాతకాలతో స్టార్ట్ చేశాడు. అదేంటి నేను నమ్మను కదా, ఇక సినిమా చేయకూడదని అనుకున్నాను. ఇంటర్వెల్ వరకు కథ విని నో చెబుదాం అనుకున్నాను. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరింది. సెకెండాఫ్ నెరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అన్నీ మరిచిపోయాను. నో చెప్పకుండా ఎస్ చెప్పాను. ఈ కథలో ఆ మేజిక్ ఉంది.”

తన ఇమేజ్ కు, ఎంచుకుంటున్న కథలకు సంబంధం లేదంటున్నాడు ప్రభాస్. బాహుబలి హిట్టయిందని యాక్షన్ సినిమాలే చేస్తూ కూర్చుంటే ప్రేక్షకులు తిరస్కరిస్తారని, తననుతాను కొత్తగా ఆవిష్కరించుకోవడంతో పాటు.. ఆడియన్స్ కు ఓ కొత్త విషయం ఏదైనా చెబితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అందుకే ఎన్ని మాస్ కథలు వచ్చినా, రాధేశ్యామ్ కు ఓటేశానని అన్నాడు.

ఈనెల 11న థియేటర్లలోకి వస్తోంది రాధేశ్యామ్. ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే టికెట్లు అన్నీ అమ్ముడుపోయాయి.

Tags:    
Advertisement

Similar News