మోహన్ బాబు సినిమాకు చిరంజీవి వాయిస్ ఓవర్

మోహన్ బాబు, చిరంజీవి మధ్య అనుబంధం గురించి చెప్పమంటే ఠక్కున చెప్పడం కష్టం. వాళ్లిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, అదే టైమ్ లో స్నేహ బంధం కూడా ఉంది. ఎవరు లెజెండ్, ఎవరు సెలబ్రిటీ అని నిండు సభలో వాదించుకున్న వాళ్లే.. ఆ తర్వాత హగ్గులు చేసుకొని, ముద్దులు పెట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. అంతెందుకు, నిన్నగాక మొన్న జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా మెగా కాంపౌండ్ వెర్సెస్ ముంచు కోటరీ అన్నట్టు తయారైంది పరిస్థితి. […]

Advertisement
Update:2022-02-16 16:38 IST

మోహన్ బాబు, చిరంజీవి మధ్య అనుబంధం గురించి చెప్పమంటే ఠక్కున చెప్పడం కష్టం. వాళ్లిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, అదే టైమ్ లో స్నేహ బంధం కూడా ఉంది. ఎవరు లెజెండ్, ఎవరు సెలబ్రిటీ అని నిండు సభలో వాదించుకున్న వాళ్లే.. ఆ తర్వాత హగ్గులు చేసుకొని, ముద్దులు పెట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. అంతెందుకు, నిన్నగాక మొన్న జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా మెగా కాంపౌండ్ వెర్సెస్ ముంచు కోటరీ అన్నట్టు తయారైంది పరిస్థితి. ఓవైపు ఇంత జరుగుతుంటే, మరోవైపు వీళ్లిద్దరూ కలిసిపోవడం విశేషం.

అవును.. చిరంజీవి, మోహన్ బాబు మరోసారి కలిసిపోయారు. ఎంతలా అంటే, ఏకంగా మోహన్ బాబు నటించిన సినిమాకు చిరంజీవి వాయిస్ ఓవర్ అందించారు. మీరు చదివింది నిజమే. మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమాలో మోహన్ బాబు పాత్రకు చిరంజీవి వాయిస్ ఓవర్ అందించారు.

ఈ చిత్రంలో మోహ‌న్‌బాబు పాత్ర పేరు విరుపాక్ష‌. అలా అని దేశ‌భ‌క్తి చిత్రం కాదు. న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఉన్న లొసుగులు గురించి ప్ర‌శ్నించే విధంగా విరూపాక్ష పాత్ర ఉంటుంది. ప్రైవేట్ ఆసుప‌త్రులు, ప్రైవేట్ స్కూళ్ళ త‌ర‌హాలో ఈ చిత్రంలోని హీరో ప్రైవేట్ జైలుని న‌డ‌ప‌డం విశేషం. ఈ చిత్రం ల‌క్ష్మీప్ర‌స‌న్న బ్యాన‌ర్‌ స్థాయిని పెంచేది అవుతుందని తప్ప, తగ్గించేది మాత్రం కాదంటున్నారు మేకర్స్.

Tags:    
Advertisement

Similar News