సర్కారువారి పాట ఫస్ట్ సాంగ్.. కళావతి ఎలా ఉందంటే?

సర్కారువారి పాట సినిమా నుంచి మొదటి లిరికల్ వీడియో వచ్చేసింది. తమన్-సిద్ శ్రీరామ్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య, భారీగా చిత్రీకరించిన ఈ లిరికల్ వీడియో ఊహించని విధంగా లీక్ అయిన సంగతి తెలిసిందే. దీంతో వాలంటైన్స్ డే కానుకగా రేపు రిలీజ్ చేయాల్సిన ఈ సాంగ్ ను ఈరోజే, కొద్ది సేపటి కిందట విడుదల చేశారు. ఇక పాట విషయానికొస్తే.. మరోసారి తమన్-సిద్ శ్రీరామ్ మేజిక్ రిపీట్ అయింది. కమాన్ కళావతి అనే లిరిక్స్ […]

Advertisement
Update:2022-02-13 12:24 IST

సర్కారువారి పాట సినిమా నుంచి మొదటి లిరికల్ వీడియో వచ్చేసింది. తమన్-సిద్ శ్రీరామ్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య, భారీగా చిత్రీకరించిన ఈ లిరికల్ వీడియో ఊహించని విధంగా లీక్ అయిన సంగతి తెలిసిందే. దీంతో వాలంటైన్స్ డే కానుకగా రేపు రిలీజ్ చేయాల్సిన ఈ సాంగ్ ను ఈరోజే, కొద్ది సేపటి కిందట విడుదల చేశారు.

ఇక పాట విషయానికొస్తే.. మరోసారి తమన్-సిద్ శ్రీరామ్ మేజిక్ రిపీట్ అయింది. కమాన్ కళావతి అనే లిరిక్స్ తో సాగే ఈ పాట ఇటు వెస్ట్రన్, అటు క్లాసికల్ బీట్స్ మిక్స్ తో క్యాచీగా ఉంది. సాంగ్ లో మహేష్ బాబు డాన్స్ మూమెంట్ ను కూడా పెట్టి ఫ్యాన్స్ కు రెట్టింపు ఆనందాన్నిచ్చారు మేకర్స్. ఇక కీర్తిసురేష్ అయితే మస్త్ గ్లామరస్ గా ఉంది.

ఈ లిరికల్ వీడియో కోసం ప్రత్యేకంగా సెట్ వేశారనే విషయం సాంగ్ చూస్తే అర్థమౌతోంది. అంతా ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ లో వచ్చి వీడియోకు అందం తెచ్చిపెట్టారు. సిద్ శ్రీరామ్ అలా పంచెలో, మెడపై కండువాతో కనిపించి ఆకట్టుకున్నాడు.

ఇక సాంగ్ విషయానికొస్తే.. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటకు తమన్ అద్భుతమైన బాణీని అందించాడు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు గీతామాధురి, రమ్య బెహర, మోహన భోగరాజు, సాహితి చాగంటి కోరస్ పాడారు.

Full View

Tags:    
Advertisement

Similar News