ఓటీటీలోకి బంగార్రాజు.. డేట్ ఫిక్స్
సంక్రాంతి విజేతగా నిలిచిన బంగార్రాజు, ఇప్పుడు ఓటీటీ వీక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాడు. బంగార్రాజు థియేట్రికల్ రన్ ముగియడంతో, ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య హీరోలుగా నటించిన సినిమా ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’… అనేది ఉపశీర్షిక. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. నాగార్జున నిర్మాత. ఇప్పుడీ సినిమాను వీక్షకుల కోసం డిజిటల్ తెరపైకి తీసుకొస్తోంది […]
సంక్రాంతి విజేతగా నిలిచిన బంగార్రాజు, ఇప్పుడు ఓటీటీ వీక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాడు. బంగార్రాజు థియేట్రికల్ రన్ ముగియడంతో, ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య హీరోలుగా నటించిన సినిమా ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’… అనేది ఉపశీర్షిక. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. నాగార్జున నిర్మాత. ఇప్పుడీ సినిమాను వీక్షకుల కోసం డిజిటల్ తెరపైకి తీసుకొస్తోంది ‘జీ 5’. ఫిబ్రవరి 18 నుంచి ‘జీ 5’ ఓటీటీలో సినిమా అందుబాటులోకి రానుంది.
అక్కినేని ఫ్యామిలీ – అన్నపూర్ణ స్టూడియోస్‌కు, ‘జీ 5’కు మధ్య చక్కటి అసోసియేషన్ ఉంది. ఆల్రెడీ ‘జీ 5’లో వీక్షకులను అలరిస్తున్న ‘లూజర్ 2’ ఒరిజినల్ సిరీస్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది. అఖిల్ ‘హలో’ను, నాగచైతన్య ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలను ఓటీటీలో ‘జీ 5’ విడుదల చేసింది. ఆ రెండూ సినిమాలు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వచ్చినవే.
ఇవే కాకుండా.. ఈ నెల 11న అక్కినేని మనవడు సుమంత్ హీరోగా నటించిన ‘మళ్ళీ మొదలైంది’ సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా ఓటీటీలో విడుదల చేస్తోంది జీ 5.