సూపర్ హిట్ రీమేక్ లో నాగచైతన్య
కోలీవుడ్ లో సూపర్ హిట్టయిన మానాడు సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా రీమేక్ లో ఎవరు నటించబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. మొన్నటివరకు రానా పేరు వినిపించగా, తాజాగా నాగచైతన్య పేరు చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను సురేష్ బాబు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాబట్టి రానా లేదా నాగచైతన్య నటించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి మానాడు సినిమాను తమిళ్ తో […]
కోలీవుడ్ లో సూపర్ హిట్టయిన మానాడు సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా రీమేక్ లో ఎవరు నటించబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. మొన్నటివరకు రానా పేరు వినిపించగా, తాజాగా నాగచైతన్య పేరు చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను సురేష్ బాబు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాబట్టి రానా లేదా నాగచైతన్య నటించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నిజానికి మానాడు సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేయాలనుకున్నారు. తెలుగులో టైమ్ లూప్ అనే టైటిల్ కూడా పెట్టారు. తెలుగులో ట్రయిలర్ కూడా రిలీజ్ చేశారు. కానీ సురేష్ బాబు రంగంలోకి దిగి, తెలుగులో సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపేశారు. తెలుగు డబ్బింగ్ రైట్స్ తో పాటు.. ఆల్ ఇండియా రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు.
టైమ్ లూప్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో శింబు హీరోగా నటించాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. తెలుగు వెర్షన్ కు కూడా ఇతడే దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి హీరో ఎవరనేది సస్పెన్స్. సురేష్ బాబు తన ఆస్థాన హీరోలతోనే సినిమాను కానిచ్చేస్తారా లేక మరో పెద్ద హీరోను సంప్రదిస్తారా అనేది తేలాల్సి ఉంది.