వెనక్కి తగ్గిన సోము.. సీమవాసులకు క్షమాపణ..

‘రాయలసీమలో ఎయిర్‌ పోర్ట్‌.. కడపలో ఎయిర్‌ పోర్ట్‌.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్‌ పోర్ట్‌.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు..’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎట్టకేలకు రాయలసీమ వాసులకు క్షమాపణలు చెప్పారు. ప్రభుత్వ తీరును విమర్శించే క్రమంలో వాడిన పదాలు రాయలసీమ ప్రజల మనసులను గాయపరిచాయని.. అందుకే వాటిని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. ఆ వ్యాఖ్యలపై రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. ‘రాయలసీమ రతనాల […]

Advertisement
Update:2022-01-29 07:03 IST

‘రాయలసీమలో ఎయిర్‌ పోర్ట్‌.. కడపలో ఎయిర్‌ పోర్ట్‌.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్‌ పోర్ట్‌.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు..’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎట్టకేలకు రాయలసీమ వాసులకు క్షమాపణలు చెప్పారు. ప్రభుత్వ తీరును విమర్శించే క్రమంలో వాడిన పదాలు రాయలసీమ ప్రజల మనసులను గాయపరిచాయని.. అందుకే వాటిని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. ఆ వ్యాఖ్యలపై రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. ‘రాయలసీమ రతనాల సీమ’ అనే పదం తన హృదయంలో పదిలమని చెప్పారు. రాయలసీమ అభివృద్ధి కోసం అనేక వేదికలపై తాను ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలనేదే తమ ఆలోచన అని వివరించారు సోము వీర్రాజు.

‘ప్రాణాలు తీసేవాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట్’ అంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది. రాయలసీమ వాసులు ఆయన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండించారు. అటు రాయలసీమ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. వైసీపీ, వామపక్షాల నేతలు సోము వీర్రాజు వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాయలసీమ ప్రజల సంస్కృతిని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు.

ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ సోము వీర్రాజు ఓ ప్రకటన విడుదల చేశారు. క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌లు హ‌త్య‌లు చేస్తార‌నే ఉద్దేశంతో తాను మాట్లాడ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య ఘ‌ట‌న‌ను ఉద్దేశించి మాత్రమే తాన‌లా మాట్లాడానని చెప్పుకొచ్చారు. త‌న వ్యాఖ్య‌ల‌తో క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సంబంధం లేద‌ని అన్నారు. అయితే నిరసన సెగ మరింతగా పెరగడంతో సోము వీర్రాజు ఈరోజు బహిరంగ క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని, ఆ వ్యాఖ్యలపై రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు.

Advertisement

Similar News