శింబు సినిమాకు తెలుగులో క్రేజీ ఆఫర్
టాలీవుడ్‌లో అగ్రగామి నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. కొన్ని సినిమాలు చివరి దశలో ఉండగా ఇంకొన్ని ప్రాజెక్టులు, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్ లైన్ అప్ లో ఉన్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన మానాడు సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌తో పాటు అన్ని భాషల రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. తెలుగు వర్షన్ సినిమాకు ఏషియన్ సినిమాస్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతోంది. […]
టాలీవుడ్‌లో అగ్రగామి నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. కొన్ని సినిమాలు చివరి దశలో ఉండగా ఇంకొన్ని ప్రాజెక్టులు, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్ లైన్ అప్ లో ఉన్నాయి.
తమిళంలో సూపర్ హిట్ అయిన మానాడు సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌తో పాటు అన్ని భాషల రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. తెలుగు వర్షన్ సినిమాకు ఏషియన్ సినిమాస్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతోంది.
శింబు, కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా ఎస్ జే సూర్య ప్రతినాయకుడిగా నటించిన సినిమా మానాడు. హాలీవుడ్ మూవీ టెనెట్ స్ఫూర్తితో తీసిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. తమిళ్ లో ఈ సినిమా పెద్ద హిట్టయింది. 2021లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా కోలీవుడ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది.
త్వరలోనే ఈ సినిమా రీమేక్ లో నటించనున్న తెలుగు హీరో ఎవరనేది తెలుస్తుంది. సురేష్ బాబు ఈ సినిమా రైట్స్ తీసుకున్నారని తెలిసిన వెంటనే, ఈ రీమేక్ లో రానా హీరోగా నటిస్తాడంటూ అప్పుడే పుకార్లు మొదలైపోయాయి.