అలాంటి పెద్దరికం నాకొద్దు " చిరంజీవి

లెజెండ్ దాసరి నారాయణరావు తర్వాత టాలీవుడ్ కు పెద్ద దిక్కు ఎవరు? ఆ పెద్ద మనిషి పాత్ర పోషించేది ఎవరు? మొన్నటివరకు ఈ స్థానంలో చిరంజీవిని చూశారు చాలామంది. చిరు కూడా అందుకు తగ్గట్టుగానే వ్యవహరించారు. కానీ రోజులు గడిచేకొద్దీ చిరంజీవిపై కూడా విమర్శల జడివాన మొదలైంది. ఏకంగా బాలకృష్ణ లాంటి సీనియర్ హీరో, చిరంజీవి పెద్దరికాన్ని అవహేళన చేస్తూ.. గతంలో కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో చిరంజీవి నేతృత్వంలో చర్చలు జరిగితే, దాన్ని రియల్ ఎస్టేట్ […]

Advertisement
Update:2022-01-02 13:47 IST

లెజెండ్ దాసరి నారాయణరావు తర్వాత టాలీవుడ్ కు పెద్ద దిక్కు ఎవరు? ఆ పెద్ద మనిషి పాత్ర పోషించేది ఎవరు? మొన్నటివరకు ఈ స్థానంలో చిరంజీవిని చూశారు చాలామంది. చిరు కూడా అందుకు తగ్గట్టుగానే వ్యవహరించారు. కానీ రోజులు గడిచేకొద్దీ చిరంజీవిపై కూడా విమర్శల జడివాన మొదలైంది. ఏకంగా బాలకృష్ణ లాంటి సీనియర్ హీరో, చిరంజీవి పెద్దరికాన్ని అవహేళన చేస్తూ.. గతంలో కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో చిరంజీవి నేతృత్వంలో చర్చలు జరిగితే, దాన్ని రియల్ ఎస్టేట్ దందాగా విమర్శించారు బాలకృష్ణ. ఆ తర్వాత జరిగిన మరికొన్ని పరిణామాలతో చిరంజీవి పెద్దరికం తీసుకోవడం తగ్గించేశారు. ఇప్పుడు ఈ అంశంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.

టాలీవుడ్ లో పెద్దమనిషి పాత్ర పోషించడం తనకు ఎంతమాత్రం ఇష్టంలేదని కుండబద్దలుకొట్టారు చిరంజీవి. ఇండస్ట్రీకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, సినీకళామతల్లి బిడ్డగా, తను బాధ్యత తీసుకుంటానని.. అంతేతప్ప పెద్దరికం మాత్రం తీసుకోనని విస్పష్టంగా చెప్పేశారు. రెండు యూనియన్లు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు తన దగ్గరకు పంచాయితీ కోసం రావొద్దని తెగేసి చెప్పిన చిరంజీవి.. అదే సమయంలో ఇండస్ట్రీ సంక్షోభంలో ఉన్నప్పుడు, ఏదైనా సహాయసహకారం అందించాల్సి వచ్చినప్పుడు భుజం పట్టడానికి, బాధ్యత తీసుకోవడానికి తను ఎప్పుడూ ముందుంటానని క్లారిటీ ఇచ్చారు.

నిజానికి ఈ ఒక్క ప్రకటనతో చిరంజీవి అసలైన పెద్దమనిషి అనిపించుకున్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడు, కరోనా సమయంలో సినీకార్మికులకు సహాయం చేసినప్పుడు, ఆ తర్వాత చాలామందికి వ్యాక్సిన్ ఇప్పించినప్పుడు టాలీవుడ్ కు పెద్ద దిక్కు అనిపించుకున్నారు చిరంజీవి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో నిజంగానే పెద్దమనిషి అనిపించుకున్నారు. ఈ ఒక్క స్టేట్ మెంట్ చాలు.. దాసరి తర్వాత స్థానం చిరంజీవికి ఇవ్వడానికి.

Tags:    
Advertisement

Similar News