సమంత సినిమాలో వరలక్ష్మి

సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా ‘యశోద’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హరి-హరీష్ అనే ఇద్దరు ఈ సినిమాతో దర్శకులుగా పరిచయం అవుతున్నారు. సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనుంది. సినిమాలో సమంత యశోద పాత్రలో కనిపించనుంది. ఈమెతో పాటు మధుబాల అనే మరో కీలక పాత్ర ఉంది. ఈ […]

Advertisement
Update:2021-12-15 14:29 IST

సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా ‘యశోద’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హరి-హరీష్ అనే ఇద్దరు ఈ సినిమాతో దర్శకులుగా పరిచయం అవుతున్నారు. సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనుంది.

సినిమాలో సమంత యశోద పాత్రలో కనిపించనుంది. ఈమెతో పాటు మధుబాల అనే మరో కీలక పాత్ర ఉంది. ఈ పాత్ర కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ను తీసుకున్నారు. ఆమె ఈరోజు నుంచి సెట్స్ పైకి వచ్చింది. ఈనెల 6వ తేదీన మొదలైన ఈ ఫస్ట్ షెడ్యూల్.. 23వ తేదీ వరకు కొనసాగుతుంది.

జనవరి 3 నుంచి రెండో షెడ్యూల్ మొదలుపెడతారు. గ్యాప్ లేకుండా షూటింగ్ పూర్తిచేసి, మార్చి నాటికి ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. థ్రిల్లర్ జాన‌ర్‌లో నేషనల్ లెవ‌ల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఈ కథ ఉంటుందంటున్నారు నిర్మాత.

Tags:    
Advertisement

Similar News