గూగుల్ అసిస్టెంట్‌లోని ఈ ఫీచర్లు తెలుసా?

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌లో ఉండే గూగుల్ అసిస్టెంట్.. మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. గూగుల్ అసిస్టెంట్‌లో ఉండే బేసిక్ ఫీచర్ల గురించి చాలామందికి తెలుసు. కానీ ఇందులో మనకు తెలియని ఎన్నో ఫీచర్లు దాగి ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్‌ను సరిగ్గా ఉపయోగించడం తెలిస్తే చాలు. రోజువారీ పనులన్నీ ఎంతో సులువుగా చేసుకోవచ్చు. ఇందులో ఉండే రకరకాల ఫీచర్లేంటంటే.. వాఖ్యాతగా మారి.. గూగుల్ అసిస్టెంట్‌లో ఉండే ఈ మోడ్ ద్వారా మనకు తెలియని భాషలో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాటిని మనకు […]

Advertisement
Update:2021-12-09 07:28 IST

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌లో ఉండే గూగుల్ అసిస్టెంట్.. మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. గూగుల్ అసిస్టెంట్‌లో ఉండే బేసిక్ ఫీచర్ల గురించి చాలామందికి తెలుసు. కానీ ఇందులో మనకు తెలియని ఎన్నో ఫీచర్లు దాగి ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్‌ను సరిగ్గా ఉపయోగించడం తెలిస్తే చాలు. రోజువారీ పనులన్నీ ఎంతో సులువుగా చేసుకోవచ్చు. ఇందులో ఉండే రకరకాల ఫీచర్లేంటంటే..

వాఖ్యాతగా మారి..
గూగుల్ అసిస్టెంట్‌లో ఉండే ఈ మోడ్ ద్వారా మనకు తెలియని భాషలో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాటిని మనకు నచ్చిన భాషలోకి అనువదించమని గూగుల్‌ను అడగొచ్చు. ఈ మోడ్ ను యాక్టివేట్ చేయడానికి గూగుల్‌ను ‘బీ యువర్ ఇంటర్ ప్రిటర్’ అనే కమాండ్‌తో అడగాలి. ఆ తర్వాత సంభాషణను ఏ భాషలోకి అనువదించాలో కోరుకోవచ్చు.

చదివి వినిపిస్తుంది
ఇంటర్నెట్‌లో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్‌ని చూసినప్పుడు దాన్ని బిగ్గరగా చదివి వినిపించమని మనం గూగుల్ ను అడగొచ్చు. దీనికోసం గూగుల్ అసిస్టెంట్ ను ” ఓపెన్ గూగుల్ అసిస్టెన్స్ సెట్టింగ్స్” అని అడగాలి. ఆ తర్వాత సెట్టింగ్స్‌లో ‘యూజ్ స్క్రీన్ కాంటెక్స్ట్’ ను స్విచ్ ఆన్ చేయాలి.

ఏ భాషలో అయినా ఓకే..
గూగుల్‌కు చాలా భాషలు తెలుసు. “హే గూగుల్, ఛేంజ్ అసిస్టెంట్ లాంగ్వేజ్ సెట్టింగ్స్” అనే వాయిస్ కమాండ్ ద్వారా మీకు నచ్చిన భాషలో గూగుల్ అసిస్టెంట్‌ను వాడుకోవచ్చు.

సెట్టింగులను మార్చండి
ఇంటర్నెట్లోని విషయాలే కాదు. మన మొబైల్‌లోని సెట్టింగ్స్ కూడా గూగుల్‌ను అడిగి మార్చుకోవచ్చు. ఉదాహరణకు ‘హే గూగుల్ ఓపెన్ డిస్ ప్లే సెట్టింగ్స్’ అని అడిగితే వెంటనే మొబైల్‌లోని డిస్‌ప్లే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి.

మొబైల్ పోతే..
ఇకపోతే గూగుల్ అసిస్టెంట్ అనేది యూజర్ గూగుల్ అకౌంట్‌తో లింక్ అయ్యి పనిచేస్తుంది. ఎప్పుడైనా మొబైల్ మిస్ అయితే అది ఎక్కడుందో గూగుల్ అసిస్టెంట్‌ను అడిగి తెలుసుకోవచ్చు. వేరొక మొబైల్ నుంచి ‘హే గూగుల్ ఫైండ్ మై ఫోన్’ అని అడగడం ద్వారా మన మొబైల్ ను గూగుల్ సాయంతో ట్రాక్ చేయొచ్చు.

Tags:    
Advertisement

Similar News