బంగారు రింగులు పంచిన బన్నీ

పారితోషికాలతో సంబంధం లేకుండా నటీనటులు, యూనిట్ సభ్యులు గిఫ్టులు ఇచ్చుకోవడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఆమధ్య ఉప్పెన సినిమా సక్సెస్ తో భారీ బహుమతులు అందుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. ఇప్పుడు పుష్ప యూనిట్ ఈ తరహా వార్తల్లోకెక్కింది. యూనిట్ లో కొంతమంది సభ్యులకు హీరో అల్లు అర్జున్, బంగారు రింగులు బహుమతులుగా ఇచ్చాడు. పుష్ప షూటింగ్ పూర్తయింది. రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో బన్నీ-సమంత మధ్య ఓ భారీ ఐటెంసాంగ్ షూటింగ్ పూర్తిచేశారు. ఈ […]

Advertisement
Update:2021-12-08 08:13 IST

పారితోషికాలతో సంబంధం లేకుండా నటీనటులు, యూనిట్ సభ్యులు గిఫ్టులు ఇచ్చుకోవడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఆమధ్య ఉప్పెన సినిమా సక్సెస్ తో భారీ బహుమతులు అందుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. ఇప్పుడు పుష్ప యూనిట్ ఈ తరహా వార్తల్లోకెక్కింది. యూనిట్ లో కొంతమంది సభ్యులకు హీరో అల్లు అర్జున్, బంగారు రింగులు బహుమతులుగా ఇచ్చాడు.

పుష్ప షూటింగ్ పూర్తయింది. రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో బన్నీ-సమంత మధ్య ఓ భారీ ఐటెంసాంగ్ షూటింగ్ పూర్తిచేశారు. ఈ షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా ఆర్ట్ డిపార్ట్ మెంట్ లోని కొంతమంది అసిస్టెంట్లకు, డైరక్షన్ డిపార్ట్ మెంట్, కెమెరా డిపార్ట్ మెంట్ లోని మరికొంతమంది అసిస్టెంట్లకు బంగారు రింగుల్ని బహుమతులుగా ఇచ్చాడు బన్నీ. ఒక్కో రింగ్ 10 గ్రాముల బరువు ఉంది. ఇలాంటి రింగుల్ని దాదాపు 12 మందికి గిఫ్టులుగా ఇచ్చినట్టు తెలుస్తోంది.

పుష్ప సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు బన్నీ. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో తన పేరు మారుమోగిపోతుందని భావిస్తున్నాడు. ఈనెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది పుష్ప. సౌత్ లాంగ్వేజెస్ తో పాటు, హిందీలో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News