రికార్డ్ రిపీట్ చేసిన చిరంజీవి

సాధ్యం కాదనుకున్న రికార్డ్ ను చిరంజీవి తిరగరాశారు. అప్పుడెప్పుడో 80ల్లో తను సృష్టించిన రికార్డును, మళ్లీ ఇన్నాళ్లకు రిపీట్ చేశారు. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటో తెలుసా? ఒకేసారి 3 సినిమాలు. చిరంజీవి బిజీగా ఉన్న రోజులవి. 80ల్లో ఆయన చేతి నిండా సినిమాలుండేవి. ఒక దశలో రోజుకు 3 సినిమాలు చేసేవారు చిరంజీవి. 90ల్లోకి ఎంటరైన తర్వాత, స్టార్ డమ్ వచ్చిన తర్వాత సినిమాల మధ్య గ్యాప్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంకా చెప్పాలంటే.. 1991 నుంచి […]

Advertisement
Update:2021-12-03 15:06 IST

సాధ్యం కాదనుకున్న రికార్డ్ ను చిరంజీవి తిరగరాశారు. అప్పుడెప్పుడో 80ల్లో తను సృష్టించిన రికార్డును, మళ్లీ ఇన్నాళ్లకు రిపీట్ చేశారు. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటో తెలుసా? ఒకేసారి 3 సినిమాలు.

చిరంజీవి బిజీగా ఉన్న రోజులవి. 80ల్లో ఆయన చేతి నిండా సినిమాలుండేవి. ఒక దశలో రోజుకు 3 సినిమాలు చేసేవారు చిరంజీవి. 90ల్లోకి ఎంటరైన తర్వాత, స్టార్ డమ్ వచ్చిన తర్వాత సినిమాల మధ్య గ్యాప్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంకా చెప్పాలంటే.. 1991 నుంచి చిరంజీవి నుంచి ఏడాదికి వచ్చే సినిమాల సంఖ్య తగ్గింది. ఇక ఆ తర్వాత ఒకేసారి 3 సినిమాలు ఎప్పుడూ చేయలేకపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ ఫీట్ రిపీట్ అయింది.

చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు రెండూ సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటికి అదనంగా బాబి దర్శకత్వంలో కూడా సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఇలా ఒకేసారి 3 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చి, తన 80ల నాటి రోజుల్ని గుర్తుచేశారు చిరంజీవి. మెగాస్టార్ మళ్లీ ఫామ్ లోకి రావడం అంటే ఇదే.

Tags:    
Advertisement

Similar News