కైకాల హెల్త్ అప్ డేట్ ఇచ్చిన చిరంజీవి

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి క్షీణించిన సంగతి తెలిసిందే. వయోభారంతో వచ్చిన ఆరోగ్య సమస్యల వల్ల ఆయన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చేరారు. కొన్ని రోజులుగా ఆయనకు అపోలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కైకాలను, మెగాస్టార్ చిరంజీవి ఫోన్ లో పరామర్శించారు. “ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీ కైకాల సత్యనారాయణ గారు స్పృహ లోకి వచ్చారని తెలవగానే ఆయన్ని ట్రీట్ చేస్తున్న క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి గారి […]

Advertisement
Update:2021-11-22 03:17 IST

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి క్షీణించిన సంగతి తెలిసిందే. వయోభారంతో వచ్చిన ఆరోగ్య సమస్యల వల్ల ఆయన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చేరారు. కొన్ని రోజులుగా ఆయనకు అపోలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కైకాలను, మెగాస్టార్ చిరంజీవి ఫోన్ లో పరామర్శించారు.

“ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీ కైకాల సత్యనారాయణ గారు స్పృహ లోకి వచ్చారని తెలవగానే ఆయన్ని ట్రీట్ చేస్తున్న క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి గారి సహాయంతో ఆయన్ని ఫోన్లో పలకరించాను. అయన త్వరగా కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా అయన మాట్లాడలేకపోయినా, మళ్ళీ త్వరలో ఇంటికి తిరిగిరావాలని, ఆ సందర్భాన్ని అందరం సెలెబ్రేట్ చేసుకోవాలని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్ అప్ సైగ చేసి, థాంక్ యూ అని చూపించినట్టుగా డాక్టర్ సుబ్బారెడ్డి గారు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా రావాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితో నూ ఈ విషయం పంచుకోవటంఎంతో సంతోషంగా వుంది.”

ఇలా కైకాలతో మాట్లాడిన విషయాన్ని బయటపెట్టారు చిరంజీవి. మరోవైపు అపోలో వైద్యులు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. కైకాల ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదని, అత్యంత విషమంగా ఉందని ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News