యూట్యూబ్‌లో డిస్ లైక్‌లు ఇక ఉండవ్..!

యూట్యూబ్ తాజాగా సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీనివల్ల ఇకపై యూట్యూబ్‌లో డిస్ లైక్ లు కనిపించవు. యూట్యూబ్ తీసుకున్న నిర్ణయంతో డిస్ లైక్ లు ఇక కనిపించక పోయినా వీడియో ని క్రియేట్ చేసిన వారికి మాత్రమే ప్రైవేట్ గా కనిపిస్తాయి. కొత్తగా యూట్యూబ్ లోకి వచ్చి వీడియోలు క్రియేట్ చేస్తున్న యూట్యూబర్లు డిస్ లైక్ లతో నిరాశ చెందుతున్నారు. ఇటువంటి వారికి అండగా నిలవడం కోసం, క్రియేటివిటీని ప్రోత్సహించేందు కోసం యూట్యూబ్ ఈ మేరకు నిర్ణయం […]

Advertisement
Update:2021-11-12 14:39 IST

యూట్యూబ్ తాజాగా సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీనివల్ల ఇకపై యూట్యూబ్‌లో డిస్ లైక్ లు కనిపించవు. యూట్యూబ్ తీసుకున్న నిర్ణయంతో డిస్ లైక్ లు ఇక కనిపించక పోయినా వీడియో ని క్రియేట్ చేసిన వారికి మాత్రమే ప్రైవేట్ గా కనిపిస్తాయి. కొత్తగా యూట్యూబ్ లోకి వచ్చి వీడియోలు క్రియేట్ చేస్తున్న యూట్యూబర్లు డిస్ లైక్ లతో నిరాశ చెందుతున్నారు. ఇటువంటి వారికి అండగా నిలవడం కోసం, క్రియేటివిటీని ప్రోత్సహించేందు కోసం యూట్యూబ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

సాధారణంగా సినిమాలకు సంబంధించి గానీ పాటలకు సంబంధించి గానీ, ట్రైలర్స్, టీజర్స్ తదితర వీడియోలు నచ్చకపోతే డిస్ లైక్ చేస్తుంటారు. అగ్ర హీరోలు నటించే సినిమాలకు సంబంధించిన పాటలు, టీజర్స్, ట్రైలర్స్ విడుదలైన సమయంలో లైక్స్ తో పాటు డిస్ లైక్స్ కూడా భారీగా వస్తుండటం చూస్తుంటాం. వీడియో నచ్చని వారు, అలాగే హీరోలకు ఉండే యాంటీ ఫ్యాన్స్ డిస్ లైక్స్ చేస్తుంటారు. యూట్యూబ్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ డిస్ లైక్స్ ఇక కనిపించవు. డిస్ లైక్స్ ఉన్నా అవి అందరికీ కనిపించవు. వీడియో అప్లోడ్ చేసిన వారికి మాత్రమే కనిపిస్తుంటాయి.

యూట్యూబ్ నిర్ణయం ‘ఫేక్ రాయుళ్ల’ కు వరం
యూట్యూబ్ తీసుకున్న తాజా నిర్ణయం అందరికీ నచ్చుతున్న ఫేక్ వీడియోలు అప్లోడ్ చేసే వాళ్లకు మాత్రం వరంగా మారనుంది. యూట్యూబ్ ద్వారా సంచలనం సృష్టించేందుకు కోసం, వ్యూస్ ద్వారా ఆదాయం పెంచుకోవడం కోసం కొందరు సెలబ్రెటీలను టార్గెట్ గా చేసుకొని వీడియోలు చేస్తుంటారు. ఎంతో మంది సెలబ్రిటీలు, నటులు చనిపోయారని లేదా ప్రమాదాల బారిన పడ్డారని వీడియోలు క్రియేట్ చేయడం చూస్తూనే ఉంటాం. అలాగే సెలబ్రిటీల పై అసత్య ఆరోపణలు, నిందలు వేయడం కూడా చూస్తూ ఉంటాం.

అలాంటి సందర్భాల్లో సదరు సెలబ్రిటీలు మీడియా ముందుకు వచ్చి తమకేమీ కాలేదని, తమపై వచ్చిన ఆరోపణలు గాలి వార్తలని.. నమ్మొద్దని.. ప్రకటనలు చేస్తుంటారు. రెండు రోజుల కిందట కూడా రెజ్లర్ నిషా దహియాను దుండగులు కాల్చి చంపినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై నిషా స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఫేక్ వార్తలు నమ్మొద్దని, తాను సురక్షితంగానే ఉన్నానని.. గోండాలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు వచ్చినట్లు ఒక వీడియో విడుదల చేశారు.

కాగా ఫేక్ వీడియోలు చేసే వారికి ప్రజలు తమ వ్యతిరేకతను డిస్ లైక్స్ ద్వారా చూపుతుంటారు. యూట్యూబ్ తీసుకున్న నిర్ణయంతో ఇలాంటి ఫేక్ వీడియోలపై కూడా ఇకపై డిస్ లైక్స్ కనిపించవు. కేవలం అప్లోడ్ చేసిన వారికి మాత్రమే కనిపిస్తాయి కాబట్టి వారు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News