ఫెయిర్ నెస్ క్రీమ్స్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..

గతేడాది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వందలాదిమంది వింత వ్యాధితో బాధపడ్డ విషయం తెలిసిందే. తాగునీటిలో పాదరసం (మెర్క్యురీ) అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని, దానివల్లే వందలమంది ఆస్పత్రిపాలయ్యారని ప్రాథమిక అధ్యనంలో తేలింది. మెర్క్యురీ ఏ రూపంలో మన శరీరంలోకి వెళ్లినా చాలా ప్రమాదకరం. అయితే ప్రస్తుతం చర్మసౌందర్యంకోసం వాడే ఫెయిర్ నెస్ క్రీమ్స్ లో మెర్క్యురీని ఎక్కువగా వాడుతున్నారు. పరిమితికి మించి.. కొన్నిసార్లు వెయ్యిరెట్లు ఎక్కువగా మెర్క్యురీని వాడుతున్నారు. ఇలాంటి ఫెయిర్ నెస్ క్రీమ్స్ ని భారత్ గతంలోనే […]

Advertisement
Update:2021-11-12 07:50 IST

గతేడాది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వందలాదిమంది వింత వ్యాధితో బాధపడ్డ విషయం తెలిసిందే. తాగునీటిలో పాదరసం (మెర్క్యురీ) అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని, దానివల్లే వందలమంది ఆస్పత్రిపాలయ్యారని ప్రాథమిక అధ్యనంలో తేలింది. మెర్క్యురీ ఏ రూపంలో మన శరీరంలోకి వెళ్లినా చాలా ప్రమాదకరం. అయితే ప్రస్తుతం చర్మసౌందర్యంకోసం వాడే ఫెయిర్ నెస్ క్రీమ్స్ లో మెర్క్యురీని ఎక్కువగా వాడుతున్నారు. పరిమితికి మించి.. కొన్నిసార్లు వెయ్యిరెట్లు ఎక్కువగా మెర్క్యురీని వాడుతున్నారు. ఇలాంటి ఫెయిర్ నెస్ క్రీమ్స్ ని భారత్ గతంలోనే నిషేధించినా ఇతర మార్గాల్లో అవి మార్కెట్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ తయారీ ఫెయిర్ నెస్ క్రీమ్స్ తో యమా డేంజర్ అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఢిల్లీకి చెందిన ఓ పరిశోధనా సంస్థ.. ఫెయిర్ నెస్ క్రీమ్స్ లో మెర్క్యురీ అవశేషాలపై పరిశోధనలు చేపట్టింది. మొత్తం 15 రకాల బ్రాండ్లను పరిశీలించింది. ఏపీ, మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ నుంచి శాంపిల్స్ ను సేకరించింది. వీటిలో మేడిన్ ఇండియా బ్రాండ్లతోపాటు, ఫిలిప్పైన్స్, పాకిస్తాన్ తయారీ రకాలు కూడా ఉన్నాయి. వీటిలో 6 శాంపిల్స్ లో పరిమితికి మించి మెర్క్యురీ వాడినట్టు తేలింది. ఆ 6 రకాలు కూడా పాకిస్తాన్ తయారీ లేబుళ్లతో మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

ఫెయిర్ నెస్ క్రీమ్స్ లో 1 పీపీఎం స్థాయి వరకు మెర్క్యురీ ఉండటానికి అనుమతి ఉంది. అయితే పాకిస్తాన్ తయారీ ఫెయిర్ నెస్ క్రీమ్స్ లో 4000 పీపీఎం నుంచి 14000 పీపీఎం వరకు అంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో మెర్క్యురీ ఉంది. 2019లో కూడా ఇలాంటి పరిశోధన జరిగిందని, అప్పుడు కూడా ప్రమాదకర స్థాయిలోనే మెర్క్యురీ స్థాయి ఉందని, అయితే ప్రభుత్వం నిషేధం విధించినా కూడా భారత మార్కెట్లో ఇలాంటి ఫెయిర్ నెస్ క్రీమ్స్ ఎక్కువగా లభ్యమవుతున్నాయని తెలిపింది ఢిల్లీలోని పరిశోధన సంస్థ.

Tags:    
Advertisement

Similar News