అఖండ టైటిల్ సాంగ్ అదిరింది

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం అఖండ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరో వైపు ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. దీపావళి సందర్బంగా విడుదల చేసిన టైటిల్ సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంది. ఆ వీడియోకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక జోష్‌ను పెంచేందుకు చిత్రయూనిట్ టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది. తమన్ సంగీత సారధ్యంలో శంకర్ మహదేవన్, అతని కుమారులు కలిసి […]

Advertisement
Update:2021-11-08 11:55 IST

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం అఖండ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరో వైపు ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.

దీపావళి సందర్బంగా విడుదల చేసిన టైటిల్ సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంది. ఆ వీడియోకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక జోష్‌ను పెంచేందుకు చిత్రయూనిట్ టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది. తమన్ సంగీత సారధ్యంలో శంకర్ మహదేవన్, అతని కుమారులు కలిసి పాడిన ఈ పాట ఇనిస్టెంట్ గా హిట్టయింది. ఇందులో అఘోర పాత్రలో బాలయ్య కనిపిస్తున్నాడు. అనంత శ్రీరామ్ అద్బుతమైన సాహిత్యాన్ని అందించారు.

అఖండ ప్రచారంలో భాగంగా ముందుగా మెలోడీ ట్రాక్ అడిగా అనే పాటను విడుదల చేశారు. మ్యూజిక్ లవర్స్‌ను ఆ పాట తెగ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన టైటిల్ ట్రాక్ క్షణాల్లో వైరల్ అయింది. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతోన్న మూడో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలున్నాయి.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న‌ ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Full View

Tags:    
Advertisement

Similar News