పెళ్లి తేదీ ప్రకటించిన హీరో

హీరో కార్తికేయకు పెళ్లి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. ఈనెల 21న తన ప్రేయసి లోహితను పెళ్లి చేసుకోబోతున్నాడు. ‘రాజా విక్రమార్క’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనకు కాబోయే భార్యను కార్తికేయ పరిచయం చేశాడు. తన నిజజీవిత ప్రేమకథను బయటపెట్టాడు. “నేనే ప్రపోజ్ చేశా. తన మెసేజ్ కోసం ఎదురుచూశా. గిఫ్టులు ఇచ్చాను. నా లైఫ్ లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ పెట్టాను. ఫోనులో ప్రపోజ్ చేశా. ఆ రోజే […]

Advertisement
Update:2021-11-07 06:10 IST

హీరో కార్తికేయకు పెళ్లి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. ఈనెల 21న తన ప్రేయసి లోహితను పెళ్లి చేసుకోబోతున్నాడు. ‘రాజా విక్రమార్క’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనకు కాబోయే భార్యను కార్తికేయ పరిచయం చేశాడు. తన నిజజీవిత ప్రేమకథను బయటపెట్టాడు.

“నేనే ప్రపోజ్ చేశా. తన మెసేజ్ కోసం ఎదురుచూశా. గిఫ్టులు ఇచ్చాను. నా లైఫ్ లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ పెట్టాను. ఫోనులో ప్రపోజ్ చేశా. ఆ రోజే ‘నేను హీరో అవుదామనుకుంటున్నాను. హీరో అయ్యాక మీ ఇంటికి వచ్చి అడుగుతా’ అని చెప్పా. ఫైనల్లీ… ఆ అమ్మాయిని నవంబర్ 21న పెళ్లి చేసుకోబోతున్నాను. తన పేరు లోహిత. తను నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గాళ్ ఫ్రెండ్. ఎక్స్ గాళ్ ఫ్రెండ్. ఇక నుంచి ఒక్కటే రోల్.. వైఫ్”

ఇలా లోహితను అందరికీ పరిచయం చేశాడు కార్తికేయ. అదే వేదికపై అని లోహితకు సినిమాటిక్ గా ప్రపోజ్ చేశారు. ఈనెల 12న రాజావిక్రమార్క సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

Tags:    
Advertisement

Similar News