నయనతార ఎంగేజ్ మెంట్ పూర్తి
చాన్నాళ్ల కిందటే చేతికి ఉంగరంతో కనిపించింది నయనతార. ఆ ఉంగరం చూసి అప్పట్లోనే ఆమెకు నిశ్చితార్థం జరిగి ఉంటుందని మీడియా అనుమానించింది. ఆ అనుమానాలు ఇన్నాళ్లకు నిజమయ్యాయి. నయనతార, విఘ్నేష్ శివన్ కు నిశ్చితార్థం పూర్తయింది. ఆ విషయాన్ని తాజాగా నయనతార బయటపెట్టింది. నెట్రికన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ తమిళ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది నయనతార. చేతికున్న ఉంగరం గురించి యాంకర్ అడిగింది. ఏమాత్రం మొహమాటపడకుండా తనకు ఎంగేజ్ మెంట్ పూర్తయిందనే విషయాన్ని బయటపెట్టింది […]
చాన్నాళ్ల కిందటే చేతికి ఉంగరంతో కనిపించింది నయనతార. ఆ ఉంగరం చూసి అప్పట్లోనే ఆమెకు
నిశ్చితార్థం జరిగి ఉంటుందని మీడియా అనుమానించింది. ఆ అనుమానాలు ఇన్నాళ్లకు నిజమయ్యాయి.
నయనతార, విఘ్నేష్ శివన్ కు నిశ్చితార్థం పూర్తయింది. ఆ విషయాన్ని తాజాగా నయనతార బయటపెట్టింది.
నెట్రికన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ తమిళ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది నయనతార. చేతికున్న
ఉంగరం గురించి యాంకర్ అడిగింది. ఏమాత్రం మొహమాటపడకుండా తనకు ఎంగేజ్ మెంట్ పూర్తయిందనే విషయాన్ని బయటపెట్టింది నయనతార.
తను, విఘ్నేష్ చాలా ప్రైవేట్ వ్యక్తులమని.. అందుకే నిశ్చితార్థాన్ని గుంభనంగా ముగించామని చెప్పుకొచ్చింది నయనతార. కేవలం ఆరుగురు కుటుంబ సభ్యుల సమక్షంలో రింగులు మార్చుకున్న విషయాన్ని బయటపెట్టిన ఈ స్టార్ హీరోయిన్.. పెళ్లిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. నిశ్చితార్థాన్ని సీక్రెట్ గా కానిచ్చేసిన నయన్, పెళ్లి విషయాన్ని మాత్రం ముందుగానే అందరికీ చెబుతానంటూ హామీ ఇచ్చింది.