‘శివసేన కార్యాలయాన్ని కూల్చేస్తాం’ మహారాష్ట్రలో మాటల యుద్ధం

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇటీవల బీజేపీ నేత ప్రసాద్​ లాడ్​ మాట్లాడుతూ.. అవసరమైతే శివసేన కార్యాలయాన్ని కూల్చేస్తామంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై శివ సైనికులు మండిపడుతున్నారు. ఈ విషయంపై ఏకంగా సీఎం ఉద్దవ్​ థాక్రే స్పందించారు. థప్పడ్ సే డర్ నహీ లగ్తా ( చెంప దెబ్బకు భయపడం) అంటూ సీరియస్​ కౌంటర్​ ఇచ్చారు. ఆదివారం పునరాభివృద్ధి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్దవ్​ థాక్రే మాట్లాడారు. ‘ కొంత మంది రెచ్చగొట్టే […]

Advertisement
Update:2021-08-02 10:22 IST

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇటీవల బీజేపీ నేత ప్రసాద్​ లాడ్​ మాట్లాడుతూ.. అవసరమైతే శివసేన కార్యాలయాన్ని కూల్చేస్తామంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై శివ సైనికులు మండిపడుతున్నారు. ఈ విషయంపై ఏకంగా సీఎం ఉద్దవ్​ థాక్రే స్పందించారు. థప్పడ్ సే డర్ నహీ లగ్తా ( చెంప దెబ్బకు భయపడం) అంటూ సీరియస్​ కౌంటర్​ ఇచ్చారు. ఆదివారం పునరాభివృద్ధి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్దవ్​ థాక్రే మాట్లాడారు.

‘ కొంత మంది రెచ్చగొట్టే భాషను మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్లకు మేం భయపడం. తగిన సమయంలో తగిన రీతిలో జవాబు చెబుతాం. బీజేపీ వాళ్లు బాల్​ థాక్రేను అవమానించేలా మాట్లాడుతున్నారు. మేము రివర్స్​ అటాక్​ మొదలుపెడితే వాళ్లు తట్టుకోలేరు. శివసైనికుల సత్తా ఏమిటో బీజేపీ వాళ్లకు బాగా తెలుసు.’ అంటూ సీఎం ఉద్దవ్​ థాక్రే కౌంటర్లు ఇచ్చారు.

ఇక ఈ విషయంపై శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ కూడా ఘాటుగా స్పందించారు. ‘బీజేపీ నేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజమైన బీజేపీ నేతలు ఇలా చేయరు. మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్లు మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. శివసేన భవన్​ను కూల్చేయాలని బీజేపీ నాయకులు ఎన్నటికీ భావించరు’ అంటూ సంజయ్​ రౌత్​ కామెంట్ చేశారు.అంతేకాక.. మహారాష్ట్రను మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా చేయాలంటూ ఆయన పరోక్షంగా కౌంటర్లు ఇచ్చారు.

ఇక బీజేపీ నేతలు సైతం సంజయ్​ రౌత్​ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మహారాష్ట్రను మత్తు రహిత రాష్ట్రంగా చేయాల్సిన అవసరముందని వారు అన్నారు. తక్షణమే.. కళానగర్​ ( సీఎం ఉద్దవ్​ థాక్రే ఉంటున్న ప్రదేశం) నుంచే ఈ పని జరగాలంటూ వాళ్లూ వ్యాఖ్యానించారు. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాలు హాట్​ హాట్​గా మారాయి.

Tags:    
Advertisement

Similar News