నిరాశపరిచిన కొత్త సినిమాలు

థియేటర్లు తెరుచుకున్నాయని సంబర పడ్డారు. వరుసగా సినిమాలొచ్చాయని ఆనందపడ్డారు. కానీ ఆ ఆనందం 24 గంటలు కూడా నిలవలేదు. వెల్లువలా వచ్చిన 5 సినిమాలు అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోతున్నాయి. అవును.. నిన్న రిలీజైన ఇష్క్, తిమ్మరుసు సినిమాలతో పాటు మిగతా 3 సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే..5 సినిమాలూ ఫ్లాప్. ఈ సినిమాల కంటెంట్ చాలా వీక్ గా ఉండడంతో మంచి టాక్ రాలేదు. దీంతో అంతోఇంతో ఆసక్తి చూపించిన ఆడియన్స్ కూడా థియేటర్లకు […]

Advertisement
Update:2021-07-31 12:59 IST

థియేటర్లు తెరుచుకున్నాయని సంబర పడ్డారు. వరుసగా సినిమాలొచ్చాయని ఆనందపడ్డారు. కానీ ఆ
ఆనందం 24 గంటలు కూడా నిలవలేదు. వెల్లువలా వచ్చిన 5 సినిమాలు అంతే వేగంగా వెనక్కి
వెళ్లిపోతున్నాయి. అవును.. నిన్న రిలీజైన ఇష్క్, తిమ్మరుసు సినిమాలతో పాటు మిగతా 3 సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే..5 సినిమాలూ ఫ్లాప్.

ఈ సినిమాల కంటెంట్ చాలా వీక్ గా ఉండడంతో మంచి టాక్ రాలేదు. దీంతో అంతోఇంతో ఆసక్తి చూపించిన ఆడియన్స్ కూడా థియేటర్లకు రాలేదు. ఫలితంగా ఈరోజు ఇష్క్, తిమ్మరుసు సినిమాలకు ఆక్యుపెన్సీ బాగా పడిపోయింది. ఇక ఆదివారం వసూళ్లు ఫైనల్. ఆరోజు ఎంత వస్తే అదే ఫైనల్. సోమవారం నుంచి సినిమాలు మరింత డల్ అయిపోతాయి.

ఇక మొదటి రోజు వసూళ్ల విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఇష్క్, తిమ్మరుసు సినిమాలకు కేవలం లక్షల్లో
మాత్రమే వసూళ్లు వచ్చాయి. ఏపీలో చాలా చోట్ల థియేటర్లు తెరవకపోవడం, రెండు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ
పెద్దగా లేకపోవడంతో తిమ్మరుసు సినిమాకు అటుఇటుగా 20 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. అటు ఇష్క్ సినిమాకు 15 లక్షల రూపాయలు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో తగ్గించిన సినిమా టిక్కెట్ రేట్ల ప్రభావం కూడా ఈ సినిమాలపై గట్టిగా పడిందని అనుకోవాలి.

Tags:    
Advertisement

Similar News