కొత్త సినిమాలపై క్లారిటీ ఇవ్వని వెంకీ

హీరోలంతా ఒకటికి రెండు సినిమాలు లైన్లో పెట్టి, ఆల్రెడీ కర్చీఫులు వేసి కూర్చుంటే.. సీనియర్ హీరో వెంకటేష్ మాత్రం ఇప్పటివరకు తన అప్ కమింగ్ సినిమాల్ని లాక్ చేయలేదు. పైపెచ్చు ఏదీ మన చేతిలో లేదంటూ వేదాంతం చెబుతున్నాడు. వెంకీ నటించిన నారప్ప, దృశ్యం-2 సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఇక ఎఫ్3 సినిమా షూటింగ్ క్లైమాక్స్ లో ఉంది. మరి ఎఫ్3 తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా ఏంటి? సరిగ్గా ఇక్కడే వెంకీ నుంచి […]

Advertisement
Update:2021-07-18 11:42 IST

హీరోలంతా ఒకటికి రెండు సినిమాలు లైన్లో పెట్టి, ఆల్రెడీ కర్చీఫులు వేసి కూర్చుంటే.. సీనియర్ హీరో
వెంకటేష్ మాత్రం ఇప్పటివరకు తన అప్ కమింగ్ సినిమాల్ని లాక్ చేయలేదు. పైపెచ్చు ఏదీ మన
చేతిలో లేదంటూ వేదాంతం చెబుతున్నాడు.

వెంకీ నటించిన నారప్ప, దృశ్యం-2 సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఇక ఎఫ్3 సినిమా షూటింగ్
క్లైమాక్స్ లో ఉంది. మరి ఎఫ్3 తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా ఏంటి? సరిగ్గా ఇక్కడే వెంకీ నుంచి
సమాధానం లేదు. ప్రస్తుతానికి తను ఏ కొత్త సినిమాకు కమిట్ అవ్వలేదని, కాలం ఏది నిర్ణయిస్తుందో
చూడాలన్నాడు వెంకటేష్.

వెంకీ లిస్ట్ లో తరుణ్ భాస్కర్, త్రివిక్రమ్ ఉన్నారు. వీళ్లలో తరుణ్ భాస్కర్ సినిమా చేయడానికి రెడీగా
ఉన్నాడు, కానీ వెంకటేశ్-సురేష్ బాబుకు ఇష్టం లేదు. అటు త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి వెంకటేష్
రెడీ. కానీ త్రివిక్రమ్ కు తీరికలేదు. దీంతో వెంకీ నెక్ట్స్ సినిమా ఏంటనేది అగమ్యగోచరంగా మారింది. ఈ
హీరో మరో రీమేక్ ఎత్తుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Tags:    
Advertisement

Similar News