తన పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్

మెహ్రీన్ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. రాబోయే చలికాలంలో పెళ్లి. ఈ పెళ్లి కోసం ఆమె ఆత్రంగా ఎదురుచూస్తోంది. ఆమె అభిమానులు కూడా. అంతలోనే భారీ షాక్. మెహ్రీన్ తన వెడ్డింగ్ ను కాన్సిల్ చేసుకుంది. ఈ విషయాన్ని తను స్వయంగా బయటపెట్టింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు భవ్యతో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత కాబోయే భార్యభర్తలిద్దరూ పెళ్లికి ముందే మాల్దీవులు పర్యటనకు వెళ్లారు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో […]

Advertisement
Update:2021-07-03 12:55 IST

మెహ్రీన్ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. రాబోయే చలికాలంలో పెళ్లి. ఈ పెళ్లి కోసం ఆమె ఆత్రంగా
ఎదురుచూస్తోంది. ఆమె అభిమానులు కూడా. అంతలోనే భారీ షాక్. మెహ్రీన్ తన వెడ్డింగ్ ను కాన్సిల్
చేసుకుంది. ఈ విషయాన్ని తను స్వయంగా బయటపెట్టింది.

హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు భవ్యతో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత కాబోయే
భార్యభర్తలిద్దరూ పెళ్లికి ముందే మాల్దీవులు పర్యటనకు వెళ్లారు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం
చేశారు. ఈ క్రమంలో వీళ్దిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి. మరోవైపు
మెహ్రీన్ కూడా పెళ్లికి సంబంధించి మెల్లమెల్లగా షాపింగ్ కూడా ప్రారంభించింది.

అంతా సెట్ అనుకుంటున్న టైమ్ లో ఉన్నట్టుండి సడెన్ గా, తను పెళ్లి రద్దు చేసుకున్నట్టు
ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఎందుకు పెళ్లి రద్దు చేసుకుందనే విషయాన్ని ఆమె
బయటపెట్టలేదు. ఇకపై తనకు భవ్యకు ఎలాంటి సంబంధం లేదని మాత్రం స్పష్టంచేసింది. ఈ
వ్యవహారంపై ఇంతకుమించి మాట్లాడనని, ఇదే తన తొలి-తుది ప్రకటన అంటూ ముగించింది.

Tags:    
Advertisement

Similar News