రంగ్ దే అక్కడ హిట్టయింది

థియేటర్లలో యావరేజ్ గా ఆడింది రంగ్ దే సినిమా. కానీ ఇదే సినిమా ఇప్పుడు బుల్లితెరపై మాత్రం సూపర్ హిట్టయింది. రీసెంట్ గా జీ తెలుగు ఛానెల్ లో ఈ సినిమాను ప్రసారం చేస్తే ఏకంగా 7.22 టీఆర్పీ వచ్చింది. ఈమధ్య కాలంలో నితిన్ కెరీర్ బెస్ట్ రేటింగ్ ఇదే. ఏడాది కిందట భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు నితిన్. ఆ సినిమాను టీవీల్లో టెలికాస్ట్ చేసినప్పుడు కూడా రంగ్ దే స్థాయిలో రేటింగ్ రాలేదు. […]

Advertisement
Update:2021-07-01 14:44 IST

థియేటర్లలో యావరేజ్ గా ఆడింది రంగ్ దే సినిమా. కానీ ఇదే సినిమా ఇప్పుడు బుల్లితెరపై మాత్రం సూపర్ హిట్టయింది. రీసెంట్ గా జీ తెలుగు ఛానెల్ లో ఈ సినిమాను ప్రసారం చేస్తే ఏకంగా 7.22 టీఆర్పీ వచ్చింది. ఈమధ్య కాలంలో నితిన్ కెరీర్ బెస్ట్ రేటింగ్ ఇదే.

ఏడాది కిందట భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు నితిన్. ఆ సినిమాను టీవీల్లో టెలికాస్ట్ చేసినప్పుడు కూడా రంగ్ దే స్థాయిలో రేటింగ్ రాలేదు. సో.. బుల్లితెర వీక్షకులు రంగ్ దే సినిమాను ఏ స్థాయిలో ఆదరించారో అర్థం చేసుకోవచ్చు.

కీర్తిసురేష్ కు టీవీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఆమె నటించిన చాలా సినిమాలు టీవీల్లో క్లిక్ అయ్యాయి. రంగ్ దే క్లిక్ అవ్వడానికి ఇది కూడా ఓ కారణం కావొచ్చు. దానికి తోడు సినిమాలో మంచి కామెడీ ఉండడం, పాటలు క్లిక్ అవ్వడంతో బుల్లితెర ప్రేక్షకులు నితిన్ సినిమాకు ఈజీగా కనెక్ట్ అయినట్టున్నారు.

Tags:    
Advertisement

Similar News