మీ ఫోన్ ఇవ్వండి.. మీకు కరోనా ఉందో లేదో చెప్పేస్తాం..

కరోనా వచ్చినా, అంతకంటే పెద్ద కష్టం వచ్చినా ఎవరూ సెల్ ఫోన్ ని మాత్రం క్షణమైనా వదిలిపెట్టరు. అంటే మనిషి ఒంటిలో ఉన్న వైరస్, స్వాబ్ సేకరిస్తే నిర్థారణ అయ్యే వైరస్, కచ్చితంగా సెల్ ఫోన్ స్క్రీన్ పై కూడా తిష్టవేసి ఉంటుందనేది వాస్తవం. ఇప్పుడిదే కరోనా కొత్త నిర్థారణ పరీక్షకు బాటలు వేసింది. ఫోన్ స్క్రీన్ టెస్టింగ్ (POST) పేరుతో కొత్త నిర్థారణ ప్రక్రియను కనిపెట్టారు బ్రిటన్ పరిశోధకులు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నేతృత్వంలో […]

Advertisement
Update:2021-06-25 02:34 IST

కరోనా వచ్చినా, అంతకంటే పెద్ద కష్టం వచ్చినా ఎవరూ సెల్ ఫోన్ ని మాత్రం క్షణమైనా వదిలిపెట్టరు. అంటే మనిషి ఒంటిలో ఉన్న వైరస్, స్వాబ్ సేకరిస్తే నిర్థారణ అయ్యే వైరస్, కచ్చితంగా సెల్ ఫోన్ స్క్రీన్ పై కూడా తిష్టవేసి ఉంటుందనేది వాస్తవం. ఇప్పుడిదే కరోనా కొత్త నిర్థారణ పరీక్షకు బాటలు వేసింది. ఫోన్ స్క్రీన్ టెస్టింగ్ (POST) పేరుతో కొత్త నిర్థారణ ప్రక్రియను కనిపెట్టారు బ్రిటన్ పరిశోధకులు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధన ద్వారా కచ్చితమైన ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు.

ముక్కు నుంచి సేక‌రించిన స్వాబ్ న‌మూనాల‌ను ప‌రీక్షించ‌డం ద్వారా కొవిడ్‌-19 పాజిటివ్‌ గా తేలిన రోగులపై ఈ పరిశోధన సాగింది. వారి మొబైల్ ఫోన్లను తీసుకుని, స్క్రీన్ పై ఉన్న స్వాబ్ న‌మూనాలను ప‌రీక్షించారు నిపుణులు. అందరికీ పాజిటివ్ అని తేలింది. అంటే ముక్కునుంచి తీసుకున్న స్వాబ్ లాగేన్ స్క్రీన్ పైనుంచి తీసుకున్న స్వాబ్ నమూనా కూడా కచ్చితమైన ఫలితాలనిచ్చిందనమాట.

పోస్ట్ ప‌రీక్ష‌ను క్లినిక‌ల్ టెస్ట్‌గా కాకుండా ప‌ర్యావ‌ర‌ణ ప‌రీక్ష‌గా ప‌రిగ‌ణిస్తామని అంటున్నారు ప‌రిశోధ‌కులు. ముక్కుద్వారా సేక‌రించే న‌మూనాల‌ను ప‌రీక్షించే ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్, ప‌రీక్ష‌తో పోలిస్తే POST టెస్ట్‌ ను సులువుగా, త‌క్కువ వ్య‌యంతో చేప‌ట్ట‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. ఫోన్ ద్వారా న‌మూనాల‌ను నిమిషంలో సేక‌రించ‌వ‌చ్చ‌ని, దీనికి నిపుణుల అవసరం కూడా లేదని పేర్కొన్నారు. అతిత‌క్కువ ఖ‌ర్చుతో పెద్ద‌సంఖ్య‌లో నిర్వహించగలిగే ఈ పోస్ట్ టెస్ట్‌ లు రాబోయే రోజుల్లో మరింత కీలకంగా మారతాయని, విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని అంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు.

Tags:    
Advertisement

Similar News