రాజమౌళి హాలీవుడ్ సినిమా ప్లానింగ్

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. ఆ మూవీ తర్వాత మహేష్ హీరోగా ఓ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. ఓవైపు ఈ రెండు సినిమాల పనులు జరుగుతుండగా, మరోవైపు ఇంకో సినిమాపై కూడా రాజమౌళి దృష్టిపెట్టాడు. అది కూడా అలాంటిలాంటి సినిమా కాదు. ఏకంగా హాలీవుడ్ మూవీ. “రాజమౌళి దర్శకత్వంలో ఓ హాలీవుడ్ ప్రాజెక్టు రెడీ అవుతోంది. అది ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం. లైవ్ యానిమేషన్ కాన్సెప్ట్ తో రాబోతోంది. కాకపోతే అది ఇండియన్ కథే. […]

Advertisement
Update:2021-06-01 12:48 IST

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. ఆ మూవీ తర్వాత మహేష్ హీరోగా ఓ సినిమా
ప్లానింగ్ లో ఉన్నాడు. ఓవైపు ఈ రెండు సినిమాల పనులు జరుగుతుండగా, మరోవైపు ఇంకో సినిమాపై
కూడా రాజమౌళి దృష్టిపెట్టాడు. అది కూడా అలాంటిలాంటి సినిమా కాదు. ఏకంగా హాలీవుడ్ మూవీ.

“రాజమౌళి దర్శకత్వంలో ఓ హాలీవుడ్ ప్రాజెక్టు రెడీ అవుతోంది. అది ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం.
లైవ్ యానిమేషన్ కాన్సెప్ట్ తో రాబోతోంది. కాకపోతే అది ఇండియన్ కథే. ఆ కథనే అంతర్జాతీయ స్థాయి
ఆడియన్స్ కోసం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి. దీనికి
సంబంధించి ఓ హాలీవుడ్ స్టుడియోతో ఒప్పందం కూడా జరిగింది.”

ఇలా రాజమౌళి హాలీవుడ్ ప్రాజెక్టును స్వయంగా అతడి తండ్రి విజయేంద్ర ప్రసాద్ బయటపెట్టారు. ఈ
ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం కథపై తను వర్క్ చేస్తున్నానని.. త్వరలోనే ఆ మూవీ సంగతులు
అధికారికంగా బయటకొస్తాయని చెబుతున్నారు విజయేంద్రప్రసాద్.

Tags:    
Advertisement

Similar News