ఫ్యామిలీ మేన్ కు అడ్డంకులు
ఊహించని విధంగా ఫ్యామిలీ మేన్ సీజన్-2కు అడ్డంకులు ఎదురయ్యాయి. తమిళనాట ఈ సిరీస్ సరికొత్త వివాదాన్ని రగల్చింది. చెన్నై నేపథ్యంలో తెరకెక్కిన సీజన్-2లో తమిళుల్ని అగౌరవంగా చూపించారని, వాళ్ల మనోభావాలు దెబ్బతినేలా ట్రయిలర్ లో సన్నివేశాలున్నాయంటూ ఏడీఎంకే నేత వైకో ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఘాటు లేఖ రాశారు. ఈ వివాదం రోజురోజుకు ముదరడంతో ఈసారి ఏకంగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఆందోళనకారులకు మద్దతు తెలుపుతూ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఫ్యామిలీ మేన్ సీజన్-2 ట్రయిలర్ […]
ఊహించని విధంగా ఫ్యామిలీ మేన్ సీజన్-2కు అడ్డంకులు ఎదురయ్యాయి. తమిళనాట ఈ సిరీస్ సరికొత్త
వివాదాన్ని రగల్చింది. చెన్నై నేపథ్యంలో తెరకెక్కిన సీజన్-2లో తమిళుల్ని అగౌరవంగా చూపించారని,
వాళ్ల మనోభావాలు దెబ్బతినేలా ట్రయిలర్ లో సన్నివేశాలున్నాయంటూ ఏడీఎంకే నేత వైకో ఆరోపణలు
చేశారు. కేంద్రానికి ఘాటు లేఖ రాశారు.
ఈ వివాదం రోజురోజుకు ముదరడంతో ఈసారి ఏకంగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఆందోళనకారులకు
మద్దతు తెలుపుతూ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఫ్యామిలీ మేన్ సీజన్-2 ట్రయిలర్ లో తమిళ ఈలం
ఉద్యమాన్ని కించపరిచారని, తమిళుల్ని ఉగ్రవాదులుగా చూపించారని తమిళనాడు ప్రభుత్వం
ఆరోపించింది. మరీ ముఖ్యంగా తమిళం మాట్లాడే సమంతను ఉగ్రవాదిగా చూపించడం, ఆమెతో తమిళ్
లోనే మాట్లాడించడం అభ్యంతరకరం అన్నారు.
జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రాబోతున్న ఈ సీజన్ ను తక్షణం ఆపేయాలని కేంద్ర
ప్రసార మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది తమిళనాడు ప్రభుత్వం. కేవలం తమ రాష్ట్రంలోనే కాకుండా..
దేశమంతా సీజన్-2 స్ట్రీమింగ్ ఆపేసి తమిళుల గౌరవాన్ని కాపాడాలని కోరింది.
మరోవైపు ఈ వివాదంపై ఫ్యామిలీ మేన్ మేకర్స్ స్పందించారు. సిరీస్ లో ఎవ్వర్నీ కించపరిచేలా
సన్నివేశాలు లేవని, ట్రయిలర్ చూసి ఓ అభిప్రాయానికి రావడం సమంజసం కాదని అంటున్నారు.
దయచేసి స్ట్రీమింగ్ ను ఎవ్వరూ అడ్డుకోవద్దని, సీజన్-2 మొత్తం చూసిన తర్వాత ఇప్పుడు ఆందోళన
చేస్తున్న వ్యక్తులే మెచ్చుకుంటారని చెబుతున్నారు.