ఈ నెలలో రాబోతున్న ఓటీటీ సినిమాలేంటంటే..

మరోసారి దేశమంతా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఇంటిలో కాలక్షేపం అవ్వాలంటే సినిమాల వినోదం ఉండాల్సిందే. ఈ సెకండ్ వేవ్ పుణ్యమా అని ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయాయి. కానీ అరచేతి థియేటర్ ఓటీటీలో బోలెడు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ లాక్ డౌన్ లో రిలీజ్ అవ్వబోతున్న కొన్ని ఓటీటీ సినిమాలేంటంటే.. నవంబర్‌ స్టోరీ.. మల్కీ బ్యూటీ తమన్నా నటించిన నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్ ఈ నెల 20న డిస్నీ హాట్ స్టార్ లో రాబోతోంది. […]

Advertisement
Update:2021-05-12 10:50 IST

మరోసారి దేశమంతా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఇంటిలో కాలక్షేపం అవ్వాలంటే సినిమాల వినోదం ఉండాల్సిందే. ఈ సెకండ్ వేవ్ పుణ్యమా అని ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయాయి. కానీ అరచేతి థియేటర్ ఓటీటీలో బోలెడు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ లాక్ డౌన్ లో రిలీజ్ అవ్వబోతున్న కొన్ని ఓటీటీ సినిమాలేంటంటే..

నవంబర్‌ స్టోరీ..
మల్కీ బ్యూటీ తమన్నా నటించిన నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్ ఈ నెల 20న డిస్నీ హాట్ స్టార్ లో రాబోతోంది. ఇటీవలే ‘లెవెన్త్‌ అవర్‌’ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు రెండోసారి నవంబర్ స్టోరీతో రెడీ అయింది. తమన్నా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. ఇంద్ర సుబ్రమణియన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

సల్మాన్ ‘రాధే’
మే 13న థియేటర్లతో పాటు ఓటీటీలోనూ రిలీజ్ కానున్న పెద్ద హీరో సినిమా రాధే. దీన్ని ‘పే ఫర్‌ వ్యూ’ పద్ధతిలో ‘జీ ఫ్లెక్స్‌’లో రిలీజ్ అవ్వనుంది. దీంతో పాటు టాటా స్కై, ఎయిర్‌టెల్‌ డీటీహెచ్ ల్లోనూ దీన్ని చూడొచ్చు. సల్మాన్‌ ఖాన్‌, దిశా పటానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు.

సినిమా బండి
కొత్త కొత్త కాన్సెప్ట్ లతో విన్నూత్నమైన సినిమాలకు ఓటీటీ మంచి వేదికగా నిలుస్తోంది. ఇటీవలే రిలీజ్ అయిన సినిమా బండి మూవీ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవ్వనుంది. కాగా దాంతోపాటు ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ సినిమా కూడా అదేరోజున జీ5 లో విడుదల కానుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ రెండు సినిమాలు మంచి వినోదాత్మక కథాంశాలతో రూపొందినట్టు తెలుస్తోంది.

ఇకపోతే దావుద్‌ ఇబ్రహీం నిజ జీవిత ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తీసిన ‘డి – కంపెనీ’ మూవీ మే 15న స్పార్క్‌ ఓటీటీలో రిలీజ్ అవ్వనుంది. వీటితో పాటు మే 12న ఆక్సీజన్, మే 14న ది వుమన్ ఇన్ ద విండో లాంటి హాలీవుడ్ సినిమాలు కూడా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వనున్నాయి.

Tags:    
Advertisement

Similar News