మళ్లీ మొదలైన థియేటర్ల మూత

ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ప్రభుత్వం అధికారికంగా ఆంక్షలు విధించకపోయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం స్వీయ నియంత్రణ విధించుకున్నారు. ఎవ్వరూ థియేటర్లకు వెళ్లడం లేదు. వకీల్ సాబ్ లాంటి సినిమాకే 4వ రోజు నుంచి వసూళ్లు లేవు. ఉగాది రోజున కొద్దిగా వసూళ్లు వచ్చినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. దీనికితోడు కొత్త రిలీజ్ లు లేవు. పెద్ద సినిమాలే వాయిదా పడుతున్న వేళ… చిన్నాచితకా సినిమాలు రిలీజ్ కు […]

Advertisement
Update:2021-04-17 14:26 IST

ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ప్రభుత్వం
అధికారికంగా ఆంక్షలు విధించకపోయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం స్వీయ నియంత్రణ
విధించుకున్నారు. ఎవ్వరూ థియేటర్లకు వెళ్లడం లేదు. వకీల్ సాబ్ లాంటి సినిమాకే 4వ రోజు నుంచి
వసూళ్లు లేవు. ఉగాది రోజున కొద్దిగా వసూళ్లు వచ్చినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది.

దీనికితోడు కొత్త రిలీజ్ లు లేవు. పెద్ద సినిమాలే వాయిదా పడుతున్న వేళ… చిన్నాచితకా సినిమాలు
రిలీజ్ కు రెడీ అవుతున్నప్పటికీ ప్రేక్షకులు వస్తారనే గ్యారెంటీ లేదు. తాజా పరిణామాలతో ఆంధ్రప్రదేశ్
లో థియేటర్లలో ఆక్యుపెన్సీ భారీగా పడిపోయింది. దీంతో థియేటర్లను స్వచ్చంధంగా మూసేస్తున్నారు.

ముందుగా ఈ మూసివేతకు సురేష్ బాబు ఆద్యుడిగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 30 నుంచి 40
థియేటర్లను మూసేశారు సురేష్ బాబు. మరికొంతమంది సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు కూడా
తమ సినిమా హాళ్లు మూసేశారు. కొత్త సినిమాల విడుదలలు లేకపోవడంతో థియేటర్లు క్లోజ్ చేస్తున్నట్టు
బయట బోర్డులు పెడుతున్నారు.

చూస్తుంటే.. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి థియేటర్లు మూతపడే పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి. మరో వారం
రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితిపై ఓ స్పష్టత వస్తుంది. ప్రభుత్వమే ఆక్యుపెన్సీ తగ్గిస్తుందా
లేక థియేటర్ యజమానులే స్వచ్చంధంగా ముందుకొచ్చి మూసేస్తారా అనే విషయంపై క్లారిటీ వస్తుంది

Tags:    
Advertisement

Similar News