ఎన్టీఆర్, బన్నీ సినిమాలపై క్లారిటీ

కొన్నాళ్ల కిందట యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రకటన వచ్చింది. ఆ టైమ్ లో మంచి మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కట్ చేస్తే, తాజాగా అదే బ్యానర్ పై, అదే దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా ప్రకటన వచ్చింది. దీంతో బన్నీ సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం మొదలైంది. ఈ పుకార్లకు వెంటనే చెక్ పెట్టారు మేకర్స్. రెండు సినిమాలూ వస్తాయని, కాకపోతే ఎన్టీఆర్ సినిమా […]

Advertisement
Update:2021-04-13 16:27 IST

కొన్నాళ్ల కిందట యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా
ప్రకటన వచ్చింది. ఆ టైమ్ లో మంచి మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కట్ చేస్తే, తాజాగా అదే
బ్యానర్ పై, అదే దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా ప్రకటన వచ్చింది. దీంతో బన్నీ సినిమా ఆగిపోయిందంటూ
ప్రచారం మొదలైంది.

ఈ పుకార్లకు వెంటనే చెక్ పెట్టారు మేకర్స్. రెండు సినిమాలూ వస్తాయని, కాకపోతే ఎన్టీఆర్ సినిమా
ముందుగా వస్తుందని, ఆ తర్వాత బన్నీ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇంకా స్పష్టంగా
చెప్పాలంటే.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బన్నీ-కొరటాల సినిమా ఉంటుంది. ఈ మేరకు గీతాఆర్ట్స్
బ్యానర్ తో సంప్రదింపులు జరిపి, ఓ అవగాహనకు వచ్చినట్టు యువసుథ ఆర్ట్స్ బ్యానర్ ప్రకటించింది.

సో.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటనేది ఓ క్లారిటీ వచ్చేసింది. ఆ సినిమా కంప్లీట్
అయిన వెంటనే కొరటాల-తారక్ కలిసి మరోసారి సెట్స్ పైకి వెళ్లబోతున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా
అనే విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News