మంచు విష్ణుకు చెల్లెలు కాదు.. అక్క

మోసగాళ్లు సినిమాలో మంచు విష్ణు, కాజల్ తోడబుట్టిన వాళ్లుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది ఈ సినిమాలో మంచు విష్ణుకు చెల్లెలిగా కాజల్ నటించిందని అనుకున్నారు. కానీ విష్ణుకు అక్క పాత్రలో కాజల్ కనిపించనుంది. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ బయటపెట్టింది. “కథ నచ్చే ఈ సినిమాలో మంచు విష్ణు హీరో పాత్రకు అక్క పాత్ర‌ చేశాను. ఈ ఎంటైర్‌ స్కామ్‌లో మాస్టర్‌ మైండ్‌ అనుదే. మనం ఇద్దరం అక్కాతమ్ముడిగా చేస్తే ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేస్తారా?అని మంచు విష్ణును అడిగాను. డైరెక్టర్‌ విజన్‌ను […]

Advertisement
Update:2021-03-17 04:18 IST

మోసగాళ్లు సినిమాలో మంచు విష్ణు, కాజల్ తోడబుట్టిన వాళ్లుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది ఈ సినిమాలో మంచు విష్ణుకు చెల్లెలిగా కాజల్ నటించిందని అనుకున్నారు. కానీ విష్ణుకు అక్క పాత్రలో కాజల్ కనిపించనుంది. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ బయటపెట్టింది.

“కథ నచ్చే ఈ సినిమాలో మంచు విష్ణు హీరో పాత్రకు అక్క పాత్ర‌ చేశాను. ఈ ఎంటైర్‌ స్కామ్‌లో మాస్టర్‌ మైండ్‌ అనుదే. మనం ఇద్దరం అక్కాతమ్ముడిగా చేస్తే ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేస్తారా?అని మంచు విష్ణును అడిగాను. డైరెక్టర్‌ విజన్‌ను నమ్మి చేద్దాం. వర్కౌట్‌ అవుతుందని విష్ణు అన్నారు. అలా మోసగాళ్ళు సినిమాను స్టార్ట్‌ చేశాం. కథ ప్రకారం నా పాత్రకు సినిమాలో లవ్‌ట్రాక్‌ లేదు. ఈ సినిమాలో అను పాత్రకు యాక్షన్‌ సీన్స్‌ లేవు. సునీల్‌శెట్టి గారితో సీన్స్‌ లేవు. నవదీప్, నవీన్‌ చంద్రలతో కొన్ని సీన్స్‌ ఉన్నాయి.”

మోసగాళ్లు అప్ డేట్స్ తో పాటు.. తన అప్ కమింగ్ మూవీస్ గురించి కూడా కాజల్ చెప్పుకొచ్చింది. ఇందులో నాగార్జున-ప్రవీణ్ సత్తారు సినిమా కూడా ఉంది.

“చిరంజీవిగారితో ఆచార్య చేస్తున్నాను. నాగ్‌ స‌ర్‌తో ఒక యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయబోతున్నాను. ఘోస్టీ అనే తమిళ సినిమాతో పాటు మరో తమిళ సినిమా చేస్తున్నాను. ఇండియన్‌ 2 సినిమా ప్రస్తుతం ఆగిపోయింది. నేను చేసిన లైవ్‌ టెలీకాస్ట్‌ వెబ్‌సిరీస్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. ఆల‌స్యంగా విడుద‌ల‌చేయ‌డ‌మే దానికి కార‌ణం అనుకుంటున్నాను. నెక్ట్స్‌ టైమ్‌ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. వెబ్‌సిరీస్‌లు చేసే ఆలోచన ఉంది. కథలు కదరాలి. నేను హోస్ట్‌గా ఓ షో ఉండొచ్చు. ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను.”

ఇలా పెళ్లి తర్వాత కూడా బిజీబిజీగా గడిపేస్తోంది కాజల్. పెళ్లి తర్వాత తనకు చాలా ప్రశాంతంగా ఉందని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.

Tags:    
Advertisement

Similar News