మొతేరాలో మ్యాచ్ అంటే మామూలుగుండదు
భారత్, ఇంగ్లండ్ మధ్య బుధవారం నుంచి జరిగే మూడో టెస్టు మ్యాచ్ కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన మొతెరా మైదానంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ బుధవారం జరగనుంది. ఈ స్టేడియం ప్రత్యేకతలేంటంటే.. ప్రపంచంలో క్రికెట్ అభిమానులకు స్టేడియం అంటే లార్డ్స్, మెల్‌బోర్న్ లాంటి స్టేడియాలు గుర్తొస్తాయి. మనదేశంలో అయితే.. ఈడెన్ గార్డెన్స్, వాంఖడే లాంటి స్టేడియాల పేర్లు చెప్తారు. కాని ఇకపై ప్రపంచ వ్యాప్తంగా మొతేరా పేరు […]
భారత్, ఇంగ్లండ్ మధ్య బుధవారం నుంచి జరిగే మూడో టెస్టు మ్యాచ్ కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన మొతెరా మైదానంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ బుధవారం జరగనుంది. ఈ స్టేడియం ప్రత్యేకతలేంటంటే..
ప్రపంచంలో క్రికెట్ అభిమానులకు స్టేడియం అంటే లార్డ్స్, మెల్‌బోర్న్ లాంటి స్టేడియాలు గుర్తొస్తాయి. మనదేశంలో అయితే.. ఈడెన్ గార్డెన్స్, వాంఖడే లాంటి స్టేడియాల పేర్లు చెప్తారు. కాని ఇకపై ప్రపంచ వ్యాప్తంగా మొతేరా పేరు మారు మ్రోగనుంది. ఎందుకంటే..
మొతేరా స్టేడియంను మూడేళ్ల పాటు కష్టపడి రెనోవేషన్ చేశారు. ఏకంగా కెపాసిటీని డబుల్ చేసి ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా రూపొందించారు. రెనోవేషన్ జరిగిన తర్వాత ఈ స్టేడియంలో మొదటిసారిగా మ్యాచ్ ఆడనున్నారు. ఆటగాళ్లు ఈ మైదానంలోకి అడుగుపెట్టగానే వావ్ అంటున్నారు. ఎందుకంటే.. దీనికెపాసిటీ ఏకంగా లక్షమందికి పైనే.. ఈ మైదానంలో మ్యాచ్ చూడడంలో కచ్చితంగా ఓ ప్రత్యేక అనుభూతినిస్తుంది.
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖర్చుతో, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన ఈ స్టేడియం.. క్రికెట్ మ్యాచ్ వీక్షణలో అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచడానికి సిద్ధమైంది. మిగిలిన స్టేడియాల్లో యావరేజ్ గా నలభై నుంచి యాభై వేల సీటింగ్ ఉంటుంది. అలాంటిది లక్షాపదివేల మంది స్టేడియం నిండుగా కూర్చుని ఉండగా మ్యాచ్ జరిగుతుంటే.. అభిమానుల అరుపులతో హోరెత్తుతుంటే ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోవచ్చు.
‘సర్దార్ పటేల్ స్టేడియం’గా కూడా పిలిచే మొతెరా లో 1983 నవంబర్‌లో ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది. సునీల్ గవస్కర్ 10 వేల పరుగుల మైలురాయిని దాటడం, రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును అధిగమిస్తూ కపిల్‌దేవ్ తన 432వ వికెట్‌ను పడగొట్టడం వంటి చిరస్మరణీయ ఘట్టాలకు ఈ మైదానం వేదికైంది. 2015 అక్టోబర్‌లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అప్పటి జీసీఏ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో స్టేడియాన్ని కూలగొట్టి.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మార్చాలని నిర్ణయించారు. 2017 జనవరిలో నిర్మాణం ప్రారంభమైన అనంతరం సరిగ్గా మూడేళ్ల తర్వాత స్టేడియం సిద్ధమైంది. గతేడాది ‘నమస్తే ట్రంప్’ ప్రోగ్రాం కూడా ఇక్కడే జరిగింది.
- మొతేరా స్టేడియం విశేషాలు
సబర్మతి నది ఒడ్డున స్టేడియం కోసం 100 ఎకరాలను 1982లో గుజరాత్ ప్రభుత్వం కేటాయించింది.
ఆస్ట్రేలియాకు చెందిన పాపులస్ సంస్థ ఈ స్టేడియాన్ని పునర్నిర్మించింది.
ఈ స్టేడియంను పూర్తిగా కూలగొట్టి సుమారు రూ.678 కోట్లతో 1 లక్షా 10వేల సీటింగ్ తో కేవలం 9 నెలల్లోనే నిర్మించారు.
మైదానంలోని ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన బెర్ముడా గడ్డిని వాడారు.
పిల్లర్లు లేకుండా ఈ స్టేడియాన్ని నిర్మించడం మరో అద్భుతం.
ప్రేక్షకులు స్టేడియంలోని ఏ మూల కూర్చున్న ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ను తిలకించే వీలుండే స్టేడియం ఇది.
ఇండోర్.. ఔట్‌డోర్ స్పోర్ట్స్, రెస్టారెంట్లు, స్విమ్మింగ్‌పూల్, జిమ్నాజియం, పార్టీ ఏరియా, 3డి థియేటర్ ఇవన్నీ ఒలింపిక్ ప్రమాణాలతో నిర్మితమయ్యాయి.
8 సెంటీ మీటర్ల వర్షం కురిసినా..వెంటనే మ్యాచ్ ప్రారంభించేలా అధునాతన డ్రేనేజీ సిస్టంను రూపొందించారు.
ఈ స్టేడియంలో 3 వేల కార్లు, 10 వేల టూ వీలర్ వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉంది.
ఈ స్టేడియంలో ఫ్లడ్‌లైట్లకు బదులు స్టేడియం పైకప్పునకే ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు.
దేశంలో ఎల్‌ఈడీ కాంతులు వెదజల్లనున్న మొట్టమొదటి స్టేడియం ఇదే. ఈ లైటింగ్ వల్ల స్టేడియంలో ఆటగాళ్ల నీడ కూడా కింద పడదు.
ఈ స్టేడియాన్ని 63 ఎకరాల్లో నిర్మించారు. పెవిలియన్ నుంచి ఆటగాడు గ్రౌండ్‌లో అడుగుపెట్టడానికే 80కి పైగా మెట్లు దిగాలి.