శ్రీవారి ఆలయానికి భూమి ఇస్తాం " వైవీ సుబ్బారెడ్డికి సీఎం హామీ

ముంబైలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆలయ నిర్మాణంతోపాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ హిందీ ప్రసారాలకు కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఈమేరకు తనను కలసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆయన హామీ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సహా, టీటీడీ జేఈవో ధర్మారెడ్డి, ఎస్వీబీసీ ఛానెల్ సీఈవో సురేష్ కుమార్.. మాహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ముంబైలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ముంబైలో […]

Advertisement
Update:2021-02-09 17:15 IST

ముంబైలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆలయ నిర్మాణంతోపాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ హిందీ ప్రసారాలకు కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఈమేరకు తనను కలసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆయన హామీ ఇచ్చారు.
టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సహా, టీటీడీ జేఈవో ధర్మారెడ్డి, ఎస్వీబీసీ ఛానెల్ సీఈవో సురేష్ కుమార్.. మాహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ముంబైలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకారం అందించాలని ఈ సందర్భంగా సీఎంను వారు కోరారు. ఎస్వీబీసీ హింది ఛానెల్ ప్రసారాలను ఉగాదినుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. హిందూ ధర్మ ప్రచారం కోసం హిందీ ఛానెల్ కి కూడా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి అంగీకరించిన ఉద్ధవ్ ఠాక్రే.. ఆలయ నిర్మాణంకోసం గత ప్రభుత్వం కేటాయించిన భూమిని పరిశీలించాలని, అది అనువుగా లేదనుకుంటే మరోచోట భూమి కేటాయిస్తామని చెప్పారు. అదే విధంగా.. ఎస్వీబీసీ హిందీ ఛానెల్ నిర్వహణకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. టీటీడీ చేపడుతున్న ధార్మిక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. వైవీ సుబ్బారెడ్డి, అధికారులు.. స్వామి వారి ప్రసాదాలు సీఎం ఠాక్రేకు అందించి శేష వస్త్రంతో సన్మానించారు.
ముంబై సలహా మండలితో సమావేశం..
ముంబైలో శ్రీవారి ఆలయం, ఎస్వీబీసీ హిందీ ఛానెల్ ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తామని స్థానిక సలహామండలి సభ్యులు కూడా టీటీడీ చైర్మన్, అధికారులకు హామీ ఇచ్చారు. వీరితోపాటు ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహా మండలి సమావేశంలో పాల్గొన్నారు. ముంబైలో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Tags:    
Advertisement

Similar News